`కల్కి` తరవాత.. రాజశేఖర్ సినిమాలేం చేయలేదు. రెండు మూడు కథల్ని ఓకే చేసినా పట్టాలెక్కించలేదు. కరోనా సోకడంతో… చాలా అనారోగ్యానికి గురై, తేరుకున్నాడు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నాడు. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించారు. టైటిల్ కూడా బయటకు వచ్చింది. అదే.. `శేఖర్`. తెల్లగడ్డం, పిల్లి కళ్లతో.. రాజశేఖర్ కొత్తగా కనిపిస్తున్నాడు. తొలిసారి తన వయసుకి తగిన పాత్రలో నటిస్తున్నట్టు అనిపిస్తోంది. మల్లికార్జున్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కల్యాణ్ రామ్ తో `కత్తి` తీసింది ఈ మల్లికార్జునే. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మీ భూపాల రచయిత. రాజశేఖర్ నటిస్తున్న 91వ సినిమా ఇది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది.