ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినట్లుగా చేస్తే మార్చి 31 తర్వాత అలాంటి అధికారులందర్నీ శంకగరి మాన్యాలు పట్టించేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగంగానే హెచ్చరించారు. ప్రభుత్వం తమదని గుర్తుంచుకోవాలని ఆయన నేరుగానే చెబుతున్నారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డ ఎస్ఈసీ గా రిటైర్ అవుతారు. అందుకే ఆయన ఆ డెడ్ లైన్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే.. అసాధారణంగా ఏకగ్రీవాలు జరిగినా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఫలితాలను రమేష్ కుమార్ నిలిపివేయించారు. వాటిపైనివేదిక ఇవ్వాలని అధికారులను అడిగాడు. అంతే.. ఎంతో కష్టపడి… ఎవరూ చేయనన్ని ఏకగ్రీవాలను చేయిస్తే… ఫలితాలు ఆపేయిస్తారా అని పెద్దిరెడ్డికి కోపం వచ్చింది.
చిత్తూరు జిల్లా కూడా ఎన్నికల అక్రమాల్లో కడప జిల్లాతో పోటీ పడుతోందన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు కోసం.. దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అధికారులు కూడా అకారణంగా పెద్ద ఎత్తున ఇతరుల నామినేషన్లను తిరస్కరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన నివేదికలను ఎస్ఈసీకి పంపాల్సి ఉంది. అందుకే.. పెద్దిరెడ్డికి కోపం వస్తోంది. అలాంటి రిపోర్టులు పంపితే.. మార్చి తర్వాత అందర్నీ శిక్షిస్తామని ఆయన బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఆయన అధికారుల్ని బెదిరించడమే కాదు… నిమ్మగడ్డపై కూడా అదే ఫ్రస్ట్రేషన్ చూపించి.. తిట్లు లంకించుకుంటున్నారు. గుంటూరులోనూ ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించంవద్దని నిమ్మగడ్డ ఆదేశించారు.
ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే కాదు రోజా, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే జోగి రమేష్ ఇలా … వైసీపీ కార్యాలయం నుంచి సూచనలు అందుకున్న ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి నిమ్మగడ్డపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీతో లింక్ పెట్టేస్తున్నారు. అయితే.. నిమ్మగడ్డ మాత్రం తాను చేయాలనుకున్నది చాలా సాఫ్ట్ గా చేసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణలో ఆయన పూర్తి పట్టు సాధించినట్లుగా కనిపిస్తోంది. అధికారులు కూడా… వైసీపీ నేతల మాట వినడం కన్నా రూల్స్ ప్రకారం పని చేయడం బెటరన్నట్లుగా ఉన్నారు. దీంతో వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ మరింతగా పెరిగిపోతోంది. అది నిమ్మగడ్డపై తిట్ల రూపంలో బయటకు వస్తోంది.