ఈనెల 12న ‘ఉప్పెన’ రిలీజ్ అవుతోంది. ఈరోజు ప్రీ రిలీజ్ వేడుక కూడా జరుగబోతోంది.చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నాడు. ప్రీ రిలీజ్ అంటే, సినిమా మొత్తం ఫినిష్ అయినట్టే అనుకోవాలి. కాకపోతే.. `ఉప్పెన`కు చివరి నిమిషంలో టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే సుకుమార్ రంగ ప్రవేశం చేసి, మార్పులూ చేర్పులూ సూచించాడని టాక్. దాంతో.. స్క్రీన్ ప్లే ఆర్డర్ అటూ ఇటూ మార్చడంలో దర్శకుడు, ఎడిటర్ తలమునకలైపోయారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఇంకో టెన్షన్ మొదలైపోయింది. తన పని పూర్తి స్థాయిలో పూర్తి కాలేదట. దేవి చేయాల్సిన వర్క్ కొంత పెండింగ్ లో ఉందని సమాచారం.
దేవి కొన్ని సన్నివేశాలకు ఆర్.ఆర్ మరింత బాగా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో.. కొన్ని బీజియమ్స్ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. అంతే కాదు… ఓ పాటని ఇంకా పూర్తి స్థాయిలో మిక్స్ చేయలేదని సమాచారం. ఆ పాట.. ఇప్పటి వరకూ విడుదల కూడా కాలేదట. ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయం నాటికి.. ఆ పాటని పూర్తి చేసి విడుదల చేయొచ్చని తెలుస్తోంది. లేదంటే.. డైరెక్టుగా థియేటర్లో చూడడమే. దేవిశ్రీ మోనార్క్. పైగా.. సుకుమార్ సినిమా అనేసరికి ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. అందుకే… `ఉప్పెన`పై ఈ స్థాయిలో ఫోకస్ పెట్టాడు. కాకపోతే.. టీమ్ అందరినీ టెన్షన్ పెట్టేస్తున్నాడు. అంతే.