ఈటీవీ – మీ టీవీ – అన్నట్టుగానే ఈటీవీని ఓన్ చేసుకున్నారు.. తెలుగు ప్రేక్షకులు. క్యాప్షన్ కు ఉండే మహత్తు అది. క్యాచీగా ఉంటే – పట్టేస్తారు. ఆ ప్రొడెక్ట్ ని మనసులో పెట్టేసుకుంటారు. ఇప్పుడు `ఆహా` కూడా కొత్త క్యాప్షన్ క్రియేట్ చేసింది. `మీరే ఆహా.. మీదే ఆహా` అంటూ. తెలుగులో రూపుదిద్దుకున్న మొట్టమొదటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్… `ఆహా`. మొదట్లో కంటెంట్ లేక కాస్త ఇబ్బంది పడినా – ఆ తరవాత మెల్లమెల్లగా కంటెంట్ బ్యాంకు పెంచుకుంది. మలయాళీ అనువాదాలతో ముంచేసినా, ఇప్పుడిప్పుడే.. `క్రాక్` లాంటి పెద్ద సినిమాల్ని కొనగలుగుతోంది. `కలర్ ఫొటో`లాంటి మంచి సినిమాలు ఆహాకి ప్లస్ అయ్యాయి. దాంతో ఆహా కూడా వినోదాల ఫ్లాట్ ఫామ్ గా సినీ గోయర్స్ గుర్తిస్తున్నారు. తాజాగా 25 మిలియన్స వ్యూవర్స్ ని సంపాదించుకోగలిగింది. ఆహా దగ్గర మొత్తం కంటెంట్ 1.25 బిలియన్ మినిట్స్ వుందట. అందుకే… ఆహా నెంబర్ 1గా మారిందని…. సగర్వంగా ప్రకటించుకుంటోంది. `మీరే ఆహా.. మీదే ఆహా` అంటూ.. ఓ కొత్త క్యాప్షన్ జోడించి ప్రేక్షకులకు మరింత దగ్గరవుదామనుఉంటోంది.
నెట్ ఫ్లిక్స్, ఆమేజాన్ లాంటి సంస్థలు గట్టిగా నిలదొక్కుకున్నాయంటే కారణం.. తమ ఒరిజినల్ సిరీస్‌లే. కొత్త ఐడియాలతో.. వెబ్ సిరీస్‌లను రూపొందించి, సినిమాలకు ధీటైన, ఓరకంగా చెప్పాలంటే సినిమాలకు మించిన వినోదాన్ని అందిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్నికైవసం చేసుకుని, ఓటీటీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ఆహా కూడా ఈ విషయంలో మరింత ముందుకు వెళ్తే… కొత్త సినిమాలపై, కొత్త కంటెంట్ పై దృష్టి పెడితే.. కచ్చితంగా మరింత బలంగా పాతుకుపోగలదు.