మారేడుమల్లిలో.. `పుష్ష` షూటింగ్ ముగిసింది. అక్కడి నుంచి చిత్రబృందం తిరుగుటపా కట్టేసింది. ఇప్పుడు అక్కడికే `ఆచార్య` బృందం వెళ్లనుంది. `ఆచార్య`లోని ఓ కీలకమైన షెడ్యూల్.. మారేడుమల్లిలోని `పుష్ష` సెట్లో జరగబోతోంది. చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రామ్ చరణ్ సెట్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు చరణ్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. అందుకోసం ఆచార్య టీమ్ మారేడుమల్లిలోని `పుష్ష` సెట్లోకి అడుగుపెట్టబోతోంది. పుష్ష షూటింగ్ జరిగిన ప్రదేశంలోనే… `ఆచార్య` కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. మారేడుమల్లి అటవీ ప్రాంతంలో `పుష్ష` కోసం ఓ ప్రత్యేకమైన గెస్ట్ హోస్ నిర్మించారు. `ఆచార్య` బృందం కూడా అక్కడే స్టే చేయబోతోంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ సోలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తార్ట. చిరంజీవి సీన్లు ఉండవు. చరణ్ పక్కన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఆమె కూడా ఈ షెడ్యూల్ లోనే.. సెట్లోకి అడుగుపెట్టే అవకాశం వుంది.