తెలుగు సాహిత్యంలో.. ప్రత్యేక ముద్ర వేసుకున్నాయి. `షాడో` నవలలు. మధుబాబుని పాపులర్ రైటర్ గా మార్చేశాయి. ఈ సిరీస్ లో దాదాపు 50 నవలలు వచ్చాయి. వీటిలో కొన్నింటిని ఎంచుకుని వెబ్ సిరీస్‌గా రూపొందిస్తామని ఇది వరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించింది.దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తామని, ఓ తెలుగు హీరో ఇందులో నటిస్తాడని కొద్ది నెలల క్రితమే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ ఈ వెబ్ సిరీస్ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. స్క్రిప్టు సిద్ధంగానే ఉన్నా, హీరోలు దొరక్కపోవడం, దొరికినా.. వాళ్లతో బడ్జెట్ సమస్యలు రావడంతో – `షాడో` మీనమేశాలు లెక్కేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెబ్ సిరీస్ గా తీస్తే వర్కవుట్ అవుతుందా? లేదా? వెబ్ సిరీస్ కంటే.. షాడో నవలల్ని వరుసగా సినిమాలుగా తీసుకుంటూ వస్తే బెటరా? అనే ఆలోచనలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పడిందని టాక్. అందుకే… `షాడో` ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.