గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ లాస్ట్ మినిట్‌లో షాక్ ఇచ్చారు. ఎంఐఎం మద్దతు తీసుకున్నారు. మజ్లిస్ నీడ కూడా పడటానికి ఆయన సిద్ధంగా లేరని చెప్పుకున్నారు కానీ..ఆయన మనస్ఫూర్తిగా ఎంఐఎం మద్దతు తీసుకున్నారు. సీల్డ్ కవర్‌లో.. కేకే కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మిని మేయర్‌గా ఎంపిక చేసి పంపించారు. ఈ మేరకు ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మేయర్ ఎన్నిక చేతులెత్తే ప్రక్రియలో జరిగింది. బీజేపీ అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. విజయలక్ష్మి పేరును.. ఎన్నికల అధికారిగాఉన్న శ్వేతా మహంతి పిలిచినప్పుడు.. మద్దతుగా టీఆర్ఎస్ సభ్యులతో పాటు.. ఎంఐఎం సభ్యులు కూడా చేతులెత్తారు.
దీంతో మెజార్టీ.. మైనార్టీ అనే ఆలోచించాల్సిన అవసరం కూడా లేకపోయింది. ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లు అవసరం లేకుండానే… టీఆర్ఎస్ మేయర్ ఎంపికయినట్లయింది. డిప్యూటీ మేయర్‌గా… తార్నాక్ కార్పొరేటర్ మోతే శ్రీలతారెడ్డినిఎంపిక చేశారు. ఆమెకు కూడా.. ఎంఐఎం మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు తీసుకోవడంతో.. బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ అంశాన్ని బీజేపీ బయట కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. ఎంఐఎం మద్దతును టీఆర్ఎస్ తీసుకోదనే అంచనాకు అనేక మంది వచ్చారు. వారందరి అంచనాలను కేసీఆర్ తలకిందులు చేశారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికలో కేసీఆర్ కులాల సమీకరణాలు చూసుకున్నారు. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన కేకే కుటుంబానికి పదవి ఇస్తున్నారు. ఆ సామాజికవర్గం టీఆర్ఎస్‌కు కాస్త దూరంగానేఉంటోంది. దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. రెడ్డి సామాజికవర్గం అటు టీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతోంది. డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చి వారినీ సంతృప్తి పిరిచినట్లుగా కేసీఆర్ భావిస్తున్నారు. అయితే మేయర్ పదవి గట్టిగా ఆశించిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి అలకకబూనాలు ఓటింగ్ లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు.