అధికారాలను సమర్ధంగా వినియోగించుకుని ఎన్నికలను ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సూచించింది. పుంగనూరు, మాచర్లలో ప్రత్యర్థులను అసలు నామినేషన్లు వేయనివ్వకపోవడం.. వేసిన వారి నామినేషన్లు తిరస్కరించడం వంటివి జరిగాయి. దీనిపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై విచరణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే…ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారిని మంత్రులు బహిరంగంగానే హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ చేశారు. ఎవరైనా ఎన్నికల కమిషన్‌కు సహకరిస్తే.. కోడ్ ఎత్తేసిన తర్వాత బ్లాక్ లిస్టే అని నిర్మోహమాటంగా హెచ్చరించారు. మాటలు మాత్రమే కాదు.. ప్రభుత్వం చేతలు కూడా అంతే ఉన్నాయి.
ఇలాంటి సందర్భాల్లో అధికారులు ఎవరూ ఎస్ఈసీ చెప్పినట్లుగా సిన్సియర్‌గా చేసే పరిస్థితులు లేవు. ఆ విషయం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఎస్ఈసీ ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం పాటిస్తున్న సూచనలు కూడా లేవు. ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి అభ్యంతం లేదు అన్న సిగ్నల్స్ వచ్చిన తర్వాత మాత్రమే అమలు చేస్తున్నారు. లేకపోతే లేదు. ఇలంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. అసలు నియోజకవర్గాల్లో.. నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో గ్రామాల్లో పోటీ చేయాలనుకుంటున్న ప్రత్యర్థులు.. ఎంత దారుణమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారో.. బెదిరింపులు ఎదుర్కున్నారో అక్కడి వారికి మాత్రమే తెలుసు.
బయటకు కూడా చెప్పుకోలేనంత దుస్థితి. చెప్పుకుంటే.. ప్రాణాలకు గ్యారంటీ ఉండని పరిస్థితి. ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా.. . పోలీసు ఉన్నతాధికారులు నోరు మెదపలేరు. చివరికి హైకోర్టు ఆదేశించినా…. ఎవరూ మాట వినే పరిస్థితి లేదు. ఎస్ఈసీ తన అధికారాల్ని ఉపయోగించుకోవాలని హైకోర్టు చెబుతోంది కానీ… ఇప్పటికైతే ఏపీలో ఆ పరిస్థితి లేదనేది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. ప్రజల మెప్పు పొందడం అంటే.. వారితో మనస్ఫూర్తిగా ఓట్లు వేయించుకోవడం.. పోటీ చేసేవారు లేకుండా చేసుకోవడం… ప్రజల్ని మెప్పించడం కాదు. ప్రజలకు ఓటు వేసే అవకాశం వచ్చిన రోజున ఫలితం తేడాగా మారిపోతుంది.