తాము ఎంత సఖ్యతగా ఉంటున్నా భారతీయ జనతా పార్టీ నాయకులు తమపై చెలరేగిపోతూండటం .. టీఆర్ఎస్ నేతలకు రుచించడం లేదు. తమకు చేతకాక సైలెంట్‌గా ఉండటం లేదని .. సహనంగా ఉంటున్నామని చెప్పుకునేందుకు వారు తాపత్రయ పడుతున్నారు. నిన్నటిదాకా కింది స్థాయి నేతలు అలా చెప్పి చూశారు. ఇప్పుడు నేరుగా కేటీఆర్, కేసీఆర్ కూడా అవే మాటలు చెబుతున్నారు. నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారసభ పెట్టిన కేసీఆర్…కాంగ్రెస్ పైనే ఎక్కువగా విరుచుకుపడ్డారు. కానీ బీజేపీ నేతలకూ వార్నింగ్‌లు ఇచ్చారు. తమ సహనానికీ హద్దు ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా కేటీఆర్ కూడా అవే మాటలు వినిపించారు. అసలు వీరు ఇంత సహనంగా ఎందుకు ఉండాల్సి వస్తోందనేది టీఆర్ఎస్ క్యాడర్‌కు వస్తున్న అనుమానం.
తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ పెను సవాళ్లు విసురుతోంది. ఇలాంటి సమయంలో… టీఆర్ఎస్ ఆ పార్టీని ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంది. కానీ కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల తర్వాత వ్యూహం మార్చారు. బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. తమ ముందు కేసీఆర్ తల వంచేశారన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తూ… చెలరేగిపోతున్నారు. ధర్మపురి అరవింద్ లాంటి నేతలు.. కేసీఆర్ ను కుక్కు అంటూ సంబోధిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినప్పటికీ .. టీఆర్ఎస్ నేతలు ఘాటుగా కౌంటర్ ఇవ్వలేదని దుస్థితి. చివరికి సహనం … పరీక్షలు.. హద్దులు దాటగలమని మాత్రం చెబుతున్నారు. ఇంత సహనాన్ని బీజేపీ విషయంలో ఎందుకు పాటించాలన్నది టీఆర్ఎస్ మెజార్టీ నేతల డౌటనుమానం. ఇది టీఆర్ఎస్ హైకమాండ్ కు మాత్రమే తెలుసు.
తెలంగాణను.. పార్టీని కాపాడుకోవడానికి కొన్ని విషయాలు చెప్పలేనని కేసీఆర్.. పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పుకొచ్చారు. బహుశా… కేసులు.. ఇతర అంశాల్లో ఆయనకు ఆందోళన ఉండి ఉండవచ్చని అంటున్నారు. అయితే… వన్ సైడ్ గా బీజేపీ విషయంలో స్లోగా ఉంటే.. దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని కమలం పార్టీ నేతలు తలమీదకెక్కడం.. టీఆర్ఎస్ నేతల్ని విస్మయానికి గురి చేస్తోంది. బీజేపీని స్లో చేయాల్న వ్యూహంతో కేసీఆర్ ఏదో చేస్తున్నారని.. అంత మాత్రాన తాము సైలెంట్ గా ఉండబోమని… బీజేపీ నేతలు ప్రకటనల ద్వారానే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహనం అంటూ ఉంటే… మరింత డ్యామేజ్ అవుతుంది కానీ.. పాజిటివ్ రాదని అంటున్నారు. బీజేపీ అనైతికంగా ఏమైనా చేస్తే..పోరాడితే ప్రజల మద్దతు లభిస్తుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సహనం మాటలు పక్కన బెట్టి బీజేపీపై పోరాడటం మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది వినిపిస్తున్నారు. ఈ విషయంలోకేసీఆర్, కేటీఆర్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కానీ ఇప్పటికైతే.. బీజేపీ వాళ్లు ఎంత రెచ్చగొట్టినా సహనంగానే ఉందామని అనుకుంటున్నారు.