ఆర్కే పలుకు : ఏపీలోనూ షర్మిల పార్టీ..!

షర్మిల రాజకీయ పార్టీ విషయంలో తాను చెప్పింది నిజం కావడంతో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త కొత్తపలుకుకు మరింత పదును పెట్టారు.ఈ సారి పూర్తి స్థాయి రాజకీయ వ్యూహంతో ఆయన తన ఆర్టికల్‌కు అక్షరాల రంగులద్దినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. షర్మిల రాజకీయ పార్టీని .. తన అన్నకు రాజకీయ ఇబ్బందులు లేకుండా తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నారు కానీ.. ఆమెకు ఏపీ కరెక్ట్ ప్లేస్ అని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చి… షర్మిలను కోరుతున్నారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి భిన్నం. రెండేళ్లలో ఆయన వందమందికిపైగా ఎమ్మెల్యేలకు ఒక్క సారిగా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలు.. ఇతర భేటీల్లో ఎదురుపడి నమస్కారం చేయడం తప్ప ఆ ఎమ్మెల్యేలు తమ గోడును జగన్ కు చెప్పుకునే అవకాశం దక్కలేదు. అందుకే వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని… ఎమ్మెల్యేలుగా ఉన్నా… కనీస ప్రాధాన్యత దక్కని చోట ఎందుకు ఉండాలన్న అభిప్రాయంలో వారున్నారని.. .పరోక్షంగా ఎండీ రాధాకృష్ణ తన ఆర్టికల్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికైతే షర్మిల వారందరి విజ్ఞాపనలను తోసి పుచ్చారు కానీ.. భవిష్యత్‌లో ముందుకు అడుగు వేయడం ఖాయమని ఆయన తన ఆర్టికల్‌లో జోస్యం చెప్పారు.

ఆర్టికల్‌లో వేమూరి రాధాకృష్ణ… చాలా స్పష్టమైన మైండ్ గేమ్‌కు తెర లేపారు. జగన్ తాడేపల్లి రాజప్రసాదంలో ఏం జరుగుతుందో మొత్తం తనకు తెలుసునని… ఆయన విస్పష్టంగా ప్రకటించుకున్నారు. అంతే కాదు.. షర్మిల జగన్ గురించి కుటుంబసభ్యులతో ఏం చెప్పిందో.. ఎక్కడ విబేధాలు తలెత్తాయో కూడా.. రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఇందులో నిజం ఎంతో ఆర్కేతో పాటు.. జగన్ కుటుంబసభ్యులకే తెలుసు. ఒక వేళ అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటే మాత్రం ఆ మైండ్ గేమ్‌కు వారు ఫ్లాటయిపోయేలా ఆర్కే కొత్త పలుకు వినిపించారు. అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు, మధ్యలో భారతీ రెడ్డికి ప్రాధాన్యం .. జగన్ జైలుకెళ్తే ఎవరు సీఎం అవ్వాలి లాంటివన్నింటినీ.. రాధాకృష్ణ స్పృశించారు. ఇప్పుడు… ఆయన చెప్పిన మాటలకు వైసీపీ నేతలు, కార్యకర్తల్లోనూ విశ్వసనీయత ఏర్పడింది. ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలోనూ సాక్షి మీడియా చెప్పని కొన్ని నిజాల కోసం… ఆంధ్రజ్యోతిని ఆ పార్టీ కేడర్ చూడాల్సి చదవాల్సి వస్తోంది.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ వారం తన ఆర్టికల్‌లో… భవిష్యత్‌లో విజయసాయిరెడ్డిపై సంచలన కథనాలు రాయబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి అతి ప్రవర్తన ఇటీవలి కాలంలో వైరల్అవుతోంది. షర్మిల పార్టీపై ఆయన అమాయకంగా .. మభ్య పెట్టేలా మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. వాటినే గుర్తు చేసిన రాధాకృష్ణ… విజయసాయిరెడ్డి గురించి కూడా తనకు కొన్ని కలలు వచ్చాయి. ఆ లీలలను తాను త్వరలోనే బయట పెడతానని హింట్ ఇచ్చారు. విజయసాయిరెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం తగ్గింది. ఆయన జగన్ మెప్పు పొందడం కోసం ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారనేది రాధాకృష్ణ విశ్లేషణ.

మొత్తానికి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు ఈ వారం రాజకీయ వ్యూహం ప్రకారం రాసుకుపోయారని అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నష్టం జరుగుతున్నా… టీడీపీ నేతలే వైసీపీపై పోరాటానికి వెనుకడుగు వేస్తున్నా… మీడియా అధిపతిగా చాలా స్పష్టమైన విజన్‌తో ఉన్న వేమూరి రాధాకృష్ణ ఎక్కడా వెనక్కి తగ్గాలనిఅనుకోవడం లేదు. ఇప్పుడు సమయం చూసుకుని మరింత దూకుడు పెంచుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close