ఆగిపోయిన పరిషత్, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడానికి అభ్యంతరం లేదంటూ ఏపీ సర్కార్ లిఖిత పూర్వకంగా తెలియచేయడంతో ఎన్నికల కమిషన్ వాటిపై దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున గ్రామాల్లో సమాంతరంగా … మరో నోటిఫికేషన్ విడుదల చేయడం సాధ్యం కాదు కాబట్టి… ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో వాయిదా వేసే సమయానికి మున్సిపల్ నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రచారం కూడా దాదాపుగా పూర్తయింది. పోలింగ్ జరగాల్సి ఉంది.
అయితే ఇప్పుడు… మళ్లీ మొదటి నుంచి నిర్వహిస్తారా లేకపోతే.. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ్నుంచి ప్రారంభిస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎస్ఈసీ పూర్తిగా… బలవంతపు ఏకగ్రీవాలు అయిన చోట మాత్రమే… అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాల్టీల్లో కడప… మాచర్ల వంటి కొన్ని చోట్ల తప్ప… పెద్దగా అభ్యంతరాలు లేవు. అందుకే … నామినేషన్ల వరకూ ఓకే చేసి… ప్రచారానికి కొంత గడువు ఇచ్చి ఎన్నికలు పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఎస్ఈసీ వర్గాలు కసరత్తు చేశాయి. పదిహేనో తేదీ అనగా సోమవారం నోటిఫికేషన్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
ఒక వేళ .. కసరత్తు పూర్తి కాలేదని అనుకుంటే… పదిహేడో తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీల పరంగానే జరుగుతాయి. పార్టీ గుర్తులే ఉంటాయి. దీంతో… గ్రామ పంచాయతీ ఎన్నికల కన్నా… మున్సిపల్ ఎన్నికలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ .. తమ కసరత్తును పూర్తి చేసింది. విశాఖ లో విజయసాయిరెడ్డి మకాం వేసి.. ఎన్నికలు వస్తున్నాయని అందరికీ చెప్పి… గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించేశారు.