స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వంతో ఢీకొట్టి చాలా పేరు తెచ్చుకున్నారు. ఆయనపై వైసీపీ నేతలు విరుచుకుపడి మరింత పబ్లిసిటీ కల్పించారు. ఆయన కూడా… శేషన్ తరహాలో… పకడ్బందీగాఎన్నికలను నిర్వహించేందుకు మొదట్లో ఆసక్తి చూపించారు. ఏకగ్రీవాల మీద అధికారుల నిర్లక్ష్యం మీద ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేశారు. జిల్లాలు కూడా తిరిగారు. అయితే అనూహ్యంగా గవర్నర్‌తో భేటీ తర్వాత ఆయనలో దూకుడు తగ్గింది. ఏకగ్రీవాలు.. కిడ్నాపులు, బెదిరింపులు లాంటివి యథావిధిగా చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల ప్రకటనలో గందరగోళం కూడా ఏర్పడుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని విమర్శలు ప్రారంభించారు.
స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇతర టీడీపీ నేతలు అదే పని చేస్తున్నారు. టీడీపీ స్వయంగా వెళ్లి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో వారు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని టీడీపీ నేతలు అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు తగ్గడానికి కారణం ఏమిటో కానీ.. టీడీపీ నేతలకు మాత్రం.. మళ్లీ పరిషత్ ఎన్నికల నాటి పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయానికి వచ్చింది.
అందుకే నిమ్మగడ్డపై ఒత్తిడి పెంచి… అక్రమాలు జరగుకుండా.. ఆయన మళ్లీ సీరియస్‌గా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ తర్వాత… ఆయన వర్కింగ్ స్టైల్‌లో మార్పులు వచ్చాయి. ఆపీసు నుంచి పనికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. పోలింగ్ రోజు ఆయన కడప జిల్లాలో పర్యటించాలనుకున్న… కంటి సమస్య పేరుతో వాయిదా వేసుకున్నారు. కుటుంబంతో తిరుమలకు వెళ్లారు. మొత్తానికి స్థానిక ఎన్నికలు ప్రారంభ సమయంలో వైసీపీకి టార్గెట్ గా ఉన్న నిమ్మగడ్డ… మధ్యలోకి వచ్చే సరికి… వైసీపీతో పాటు టీడీపీకి కూడా టార్గెట్ అయ్యారు.