తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ … గ్రేటర్ ఎన్నికల్లో వెనుకబడిన తర్వాత… ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. తిరిగి వచ్చిన తరవాత ఆయన పొలిటికల్ స్టైల్ మారిపోయింది. బీజేపీతో ఎలా ఉంటున్నారన్న విషయాన్ని పక్కన పెడితే… హామీలు.. వరాలు విషయంలో ఆయన పూర్తిగా లిబరల్గా మారిపోయింది. అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవద్దన్న నోటితోనే.. యాభై వేల ఉద్యోగాల భర్తీఅని ప్రకటించారు. ఆ తర్వాత ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు లాంటి తాయిలాలు కూడా ఇచ్చారు. కానీ కేసీఆర్ తీరుపై అందరికీ అవగాహన ఉంది కాబట్టి… ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నిక అని మెజార్టీ విశ్లేషణ చేశారు.
అయితే కొంత మందిలో మాత్రం ఆశలు ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా హామీల అమలు ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ.. కేసీఆర్ ప్రకటనలతోనే సరిపెట్టారు రెండు నెలులు దాటిపోయినా ఎలాంటి ముందడుగు వేయలేదు. దీంతో కోడ్ వచ్చేసింది. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి. ఎన్నికలయిన తర్వాత హామీలు అమలు చేస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకునే అవకాశం ఉంది. అయితే.. ఇలాంటివి చాలా చూశారు కాబట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయాల్సిన గ్రాడ్యూయేట్ ఓటర్లు, ఉద్యోగులు … ఏ మాత్రం నమ్మే అవకాశం లేదు. వారి ఆగ్రహం ఓట్ల రూపంలో కనిపించినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. కేసీఆర్ నిజాయితీగా హామీలు అమలు చేయదల్చుకుంటే…. కోడ్ అనేది అడ్డంకాదని… అంటున్నారు.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కేసీఆర్.. కోడ్ అడ్డంకి రాకుండాచూసుకుని రైతులకు నగదు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తికి… ఆరు జిల్లాలకు పరిమితమయ్యే కోడ్ ఏ విధంగానూ అడ్డంకి కాదంటున్నారు. ఉద్యోగుల జీతాలు అనేది పీఆర్సీ నివేదికను బట్టి ఉంటుంది.. దానికి కోడ్ అడ్డు రాదని.. వచ్చినా… ఈసీని కన్విన్స్ చేయవచ్చని చెబుతున్నారు. కోడ్ అడ్డం అనేది కేసీఆర్ చెబుతున్న సాకేనని చాలా మంది నమ్ముతున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. తాము చిత్తశుద్ధితో ఉన్నామని… కేసీఆర్ అండ్ టీమ్ నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.