రామ్ చరణ్ తదుపరి సినిమా శంకర్ తో అనే విషయం రూఢీ అయిపోయింది. ఇన్నాళ్లుగా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి సాససించని శంకర్… ఇప్పుడు తెలుగులో నేరుగా ఓ సినిమా చేయడం, అందునా చరణ్ ని హీరోగా ఎంచుకోవడం ఆ ప్రాజెక్టుపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. చరణ్ కూడా చాలా తర్జన భర్జనలు పడిన తరవాతే… శంకర్ సినిమాకి ఓకే చెప్పాడు. చరణ్ తాజా నిర్ణయంతో ఇద్దరు ముగ్గురు కొత్త దర్శకులు వెయిటింగ్ లిస్టులోకి వెళ్లిపోయారు.
గౌతమ్ తిన్ననూరి (జెర్సీఫేమ్) తో ఓ సినిమా చేయడానికి చరణ్ ఇది వరకే అంగీకరించాడు. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాకపోయినా, ఈ సినిమా ఎప్పుడో ఖాయమైంది. `ఆర్.ఆర్.ఆర్` తరవాత.. ఈ కాంబినేషనే పట్టాలెక్కుతుందని భావించారు. కానీ సడన్ గా శంకర్ లైన్ లోకి వచ్చాడు. దాంతో… గౌతమ్ సినిమా వెనక్కి వెళ్లింది. భీష్మతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల కూడా చరణ్ కోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. తన సినిమా కూడా ఇప్పట్లో లేనట్టే. శంకర్ సినిమా అంటే.. ఇప్పట్లో తేలే వ్యహారం కాదు. `భారతీయుడు 2` అయిన తరవాతే… ఈ సినిమా మొదలవుతుంది. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తీసుకోవడం కూడా శంకర్ కి అలవాటు. కాబట్టి.. చరణ్ – శంకర్ కాంబో పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. సెట్స్‌పై వెళ్లాక అదెప్పుడు పూర్తవుతుందో తెలీదు. కాబట్టి.. యువ దర్శకులు చరణ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే.