కొత్తగా హైదరాబాద్ మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి కి హైదరాబాద్ లోని షేక్ పేట ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి కి మధ్య వివాదం ముదురుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 11 న హైదరాబాద్ కొత్త మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి బాధ్యతలు స్వీకరించిన 72 గంటల్లోనే షేక్‌పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డికి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఇది మేయర్ ఉద్దేశ పూర్వకంగా చేయించింది అన్న ప్రచారం జరగడంతో వివాదం రాజుకుంది. వివరాల్లోకి వెళితే..
గతంలో, అంటే జనవరి 20 న విజయలక్ష్మి తనను విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ షేక్‌పేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదాయం మరియు కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో విజయ లక్ష్మిి కిి తనకు మధ్య తలెత్తిన చిన్న పంతం కారణంగా విజయ లక్ష్మి తన మద్దతుదారులతో కలిసి తన కార్యాలయంలోకి దూసుకెళ్లి గొడవ చేశారు అని MRO ఫిర్యాదులో ఆరోపించారు. అయితే విజయ లక్ష్మి ఈ ఆరోపణను ఖండిస్తూ కౌంటర్ ఫిర్యాదు చేశారు. తన మద్దతుదారుల పైై ఎంఆర్ఓ యే దాడి చేశారు అనిి ఆవిిడ అంటున్నారు. ఈ గొడవ ఇలా ఉండగా, ఇంతలో విజయ లక్ష్మి ఫిబ్రవరి 11 న జిహెచ్ఎంసి మేయర్గాా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన 72 గంటల్లోనే ఎంఆర్ఓను బదిలీ చేశారు. అదీకాక ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి అరకు లోయలో బస్సు ప్రమాదం జరిగిన సందర్భంగా, ఆ బస్సులో హైదరాబాద్ వాసులు ఉన్నకారణంగా విశాఖపట్నంలోోదానికిి సంబంధించిన సహాయక చర్యలలో ఉండగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
అయితే ప్రస్తుతం రెవిన్యూ డిపార్ట్మెంట్ షేక్‌పేట ఎమ్మార్వో కు అండగా నిలబడుతోంది. ఆయా ఉద్యోగ సంఘాల యూనియన్లు కూడా ఆయనకు మద్దతుగా మీడియాతో మాట్లాడటం తో వివాదం పెద్ద అవుతున్నట్టుగా కనిపిస్తోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, పైగా అమెరికాలో అనేక సంవత్సరాలు ఉండి వచ్చిన ఆమె ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.