గత ఏడాది జూన్ లో బలవన్మరణం పాలైన సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాలో నటించిన మరొక నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఎంఎస్ ధోని సినిమాలో సుశాంత్ తో పాటు నటించిన నటుడు సందీప్ నహర్ ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నహర్ తన నివాసంలోనే మరణించాడు. తన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే, చనిపోయే ముందు నటుుడు సందీప్ తన ఫేస్ బుక్ ఖాతాలో సూసైడ్ నోట్ వీడియో రూపంలో షేేర్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. కెెెరీర్ లో ని ఒడిదుడుకులతో పాటు వివాహం తర్వాత వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల కారణం గా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన భార్య తో పడలేక ఆత్మ హత్య చేసుకుంటున్నానని స్పష్టం గా వివరించారు. అయితే తన మరణానంతరం తన భార్య ను ఇబ్బంది పెట్టవద్దు అని కూడా ఆయన కోరారు.
ధోని సినిమా తో పాటు అక్షయ్ కుమార్ తో కేసరి సినిమా లోనూ నటించిన సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది.