ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాడి.. టీఎన్ శేషన్ తరహా ఎన్నికల కమిషనర్గా పబ్లిసిటీ పొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు అన్ని విపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కారణం మున్సిపల్ ఎన్నికల్ని ఎక్కడ ఆపేశారో.. అక్కడ్నుంచి ప్రారంభించాలని నిర్ణయించడమే. ఇప్పటికే. నోటిఫికేషన్ కూడా విడుదల చేసేశారు నిమ్మగడ్డ. దాంతో.. ఇక విపక్షాలకు విమర్శలు చేయడం తప్ప మిగిలింది ఏమీ లేదు. అదే చేస్తున్నారు. వాయిదా వేయక ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియ మొత్తం అపహాస్యం అయిందని.. కేంద్రానికి లేఖ రాసి ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడం ఏమిటనేది.. విపక్షాల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న.
ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ నడిపిస్తున్న తీరు.. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా… పాత నోటిఫికేషన్ను ఆయన కొనసాగించరని.. ఖచ్చితంగా మళ్లీ ప్రక్రియ ప్రారంభిస్తారనిఅంచనా వేశఆరు. ఎందుకంటే… రాజకీయపార్టీలన్నీ అదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. అధికారింగా సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు. కాబట్టి వారి అభ్యంతరాలు నమోదు కానట్లే. కానీ నిమ్మగడ్డ మాత్రం… ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నుంచి లేఖ అందిన వెంటనే… నోటిఫికేషన్ కొనసాగిస్తూ.. రీ నోటిఫికేషన్ జారీ చేసేశారు. అన్ని చోట్లా కాకపోయినా కనీసం ఏకగ్రీవం అయిన చోట అయినా నిమ్మగడ్డ… ఎన్నికలను నిలిపివేసి .. కొత్తగా ప్రక్రియ చేపడుతారన్నఆశల్లో ఇప్పటి వరకూ విపక్ష నేతలున్నారు.
కారణం ఏమిటో కానీ… నిమ్మగడ్డ… మెత్తబడినట్లుగా కనిపిస్తోంది. కీలక సమయంలో ఆయన తిరుమల పర్యటనకు వెళ్లి రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. నిర్ణయాలన్నీ… ప్రభుత్వం అనుకున్నట్లుగా వస్తున్నాయి. అందుకే విపక్షాలు ఆయన ఒత్తిడి తలొగ్గిపోయారని అనుకుంటున్నారు. తమ వైపు నుంచి విమర్శలు పెంచి.. ఆయన మళ్లీ గతంలోలా ఉండేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.