సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి న్యూస్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి.. చాలా మంది సోషల్ మీడియా వ్యాపారులకు పెన్ను కుట్టినట్లయింది. గాసిప్ వెబ్ సైట్లలో… గాలి పోగేసి రాసే యూ ట్యూబ్ చానళ్లలో ఏదో ఒకటి రాసేసి వ్యూస్.. వ్యూస్ సంపాదించుకుని నాలుగు రూకలు వెనకేసుకుందామనుకున్నవారు … సునీతలా ఎవరున్నారా వెతికి చివరికి సురేఖవాణిని క్యాచ్ చేశారు. ఆమె రెండో పెళ్లికి ముహుర్తం ఖరారు చేసేశారు. సురేఖ వాణి రెండో పెళ్లి అంటూ హడావుడి ప్రారంభించేశారు.
వరుడెవరో చెప్పరు… పెళ్లెప్పుడో చెప్పరు కానీ…సునీత తరహాలోనే కుమార్తె ఒత్తిడి కారణంగానే రెండో పెళ్లి చేసుకుంటోందని హోరెత్తించారు. ఒకరిని చూసి ఒకరు ఇలా రాసుకుంటూ పోయారు. రెండేళ్ల కిందట సురేఖ వాణి భర్త చనిపోయారు. ఇవన్నీ.. గాసిప్ సైట్లు రాసుకునే గాలి మాటలను మొదట లైట్ తీసుకున్న సురేఖ వాణికి… తర్వాత ఆ న్యూస్ అంతటా పాకిపోయి..తనకే.. ఎంక్వైరీలు వస్తూంటే… ఇక పులిస్టాప్ పెట్టాలనుకుంది. ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని.. అసలు రెండో సారి వివాహ బంధంలోకి అడుగు పెట్టే ఆలోచనే చేయడం లేదని స్పష్టం చేస్తూ మీడియా ప్రకటన విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియా చేయబోయిన సురేఖావాణి రెండో పెళ్లి క్యాన్సిల్ అయినట్లయింది. సోషల్ మీడియాలో గాలి పోగేసి రాసే వార్తలు.. వారి కుటుంబాల్లో ఎంత అలజడి రేపుతాయో మాత్రం.. వారు అంచనా వేయలేకపోతున్నారు.