`చిత్రం`తో చిత్రసీమని ఓ కుదుపు కుదిపాడు తేజ. చిన్న సినిమాని ఇలాక్కూడా తీయొచ్చా? అని ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ సినిమా నుంచే కొత్త టాలెంట్ గంగలా పొంగుకొచ్చింది. జయం, నువ్వు – నేను.. ఇలా వరుసగా హిట్లు కొట్టి తనకు తిరుగులేదనిపించాడు. ఆ తరవాత.. తేజ నుంచి అన్నీ ఫ్లాపులే. లేటెస్టుగా `నేనే రాజు నేనే మంత్రి`తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు తేజ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. అయినా.. సరే, తనదైన పాత పంథాలో ఇప్పుడు మరో `చిత్రం` చేయడానికి రెడీ అయ్యారు. దీనికి చిత్రం 1.1 అనే పేరు పెట్టారు. తేజతో పాటు ప్రయాణం ప్రారంభించిన ఆర్పీ పట్నాయక్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా చిత్రంలా పాత్ బ్రేకింగ్ ఐడియాతో రూపొందుతోందట. కథ, స్క్రిప్టు మొత్తం సిద్ధం. ఇక టేకాఫ్ తీసుకోవడమే తరువాయి. ప్రస్తుతం ఆర్పీ పట్నాయక్ బాణీలు సమకూర్చే పనిలో ఉన్నాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.