విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు విరసం నేత వరవరరావుకు ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో ముంబై విడిచి వెళ్లకుండా ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు షరతులు పెట్టింది. మహారాష్ట్రలోని బీమా-కోరెగాంలో జరిగిన దాడుల ఘటన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు గుర్తించి అనేక మంది మానవహక్కుల పోరాట నేతలు… రచయితలపై ఎన్నో కేసులు పెట్టారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో విప్లవ రచయితగా పేరు పొందిన వరవరరావు కూడాఉన్నారు. ఉపా చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 2018 ఆగస్టులో అరెస్ట్ జరిగింది.
మావోయస్టు సానుభూతి పరునిగా చెప్పుకునే విల్సన్ అనే వ్యక్తి ల్యాప్‌ట్యాప్‌లో దొరికిన ఉత్తరాంలటూ.. వాటిని మీడియాకు లీక్ చేసి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హక్కుల నేతలందర్నీ అరెస్టు చేశారు. ఇటీవల అవి హ్యాక్ చేసి.. వాటిని ఆ ల్యాప్ ట్యాప్‌లో ప్రవేశ పెట్టారనే వార్తలు కూడామీడియాలో వచ్చాయి. ఉపా చట్టం కింద కేసులు పెట్టడానికి అరెస్టులు చేయాడనికి.. పోలీసులు ఎలాంటి సాక్ష్యాలను చూపించాల్సిన అవసరం లేదు. ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. అందుకే వరవరరావు ఇప్పటి వరకూ జైల్లోనే ఉన్నారు. 80 ఏళ్ల వరవరరావుకు కరోనా సోకడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది.
ఇటీవల ఆయన కరోనా బారిన పడినప్పుడు.. ఆయనను విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. టీడీపీ యువనేత నారా లోకేష్, వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సహా విప్లవ భావాలు.. కమ్యూనిస్టు నేపధ్యం ఉన్న వారందరూ ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు.అయితే అప్పట్లో చికిత్స చేయించారు కానీ.. బెయిల్ మాత్రం మంజూరు చేయలేదు. మానవహక్కుల పోరాట భావజాలం ఉన్న వారికి.. వరవరరావు ఆదర్శం. ఆయన పెద్ద ఎత్తున రచనలు చేశారు. ఎట్టకేలకు ఆయన బెయిల్ లభించింది. ఆయితే ముంబైలోనే ఉండాలన్న షరతు పెట్టడంతో అక్కడే చికిత్స తీసుకునే అవకాశం ఉంది.