`ఉప్పెన` నుంచి తొలి పోస్టర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే కృతి శెట్టిపై కళ్లన్నీ పడిపోయాయి. నీ కన్ను నీలి సముద్రం.. పాట టీజర్ తో – కృతి శెట్టి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. సినిమా బయటకు రాకుండానే కొత్త ఆఫర్లు చేతికందాయి. ఇప్పుడు కృతి డేట్లు, టాలీవుడ్ లో హాట్ కేకులు. తాజాగా కృతి పారితోషికం అరకోటికి చేరిందట. అరవై లక్షలు కూడా డిమాండ్ చేస్తోందని టాక్. అయితే.. `ఉప్పెన`కు కృతికి అందిన పారితోషికం ఎంతో తెలుసా? కేవలం ఆరు లక్షలు. మైత్రీ మూవీస్, అందులోనూ విజయ్ సేతుపతి లాంటి స్టార్ ఉన్న సినిమా. అందుకే కృతి కూడా పెద్దగా డిమాండ్ చేయకుండా.. `అవకాశం రావడమే గొప్ప` అనుకుని ఈ సినిమా ఒప్పేసుకుంది. ఆ సినిమాతోనే… కృతి పాపులర్ అయిపోయింది కూడా. ముందస్తు జాగ్రత్తగా కృతితో మరో రెండు సినిమాలకు అగ్రిమెంట్లు చేయించుకుంది మైత్రీ. అయితే ఈసారి మాత్రం కృతి అడిగినంత ఇవ్వాల్సిందే. తన డిమాండ్ అలాంటిది. దర్శకుడు బుచ్చికి కూడా పెద్దగా పారితోషికం ముట్టలేదు.కేవలం ఆయన.. నెలవారీ జీతంపైనే ఈ సినిమా చేసినట్టు టాక్. అయితే.. సినిమా విడుదలై, మంచి లాభాలు వచ్చాక మాత్రం బుచ్చికి పెద్దమొత్తంలోనే పారితోషికం ఇచ్చి సంతృప్తి పరిచారు.