ఏబీఎన్ చానల్లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని.. అమరావతి జేఏసీకి చెందిన కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుతో కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై కెనడాలో స్థిరపడిన పి.ఎస్ రెడ్డి అనే రిటైర్డ్ ఐఐటీ ప్రొఫెసర్ తన అభిప్రాయాన్ని తెలుగు 360కి పంపించడం జరిగింది. తెలుగు 360 పాఠకుడు అయిన పి.ఎస్.రెడ్డి గారి అభిప్రాయాల్ని మేము ప్రచురిరిస్తున్నాం. ఆయన తన అభిప్రాయాన్ని శ్రీనివాసరావుకు లేఖ రూపంలో పంపారు.
డియర్ శ్రీనివాసరావు,
నేను ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్‌గా పని చేసి రిటైరయ్యాను. నెల్లూరుకు చెందిన నేను రిటైరైన తర్వాత కెనడాలో ఉంటున్న కుమారుడి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాను.
నేను ప్రతీ రోజూ ఏబీఎన్, టీవీ5 చానళ్లలో జరిగే చర్చా కార్యక్రమాలను చూస్తూ ఉంటారు. ఏబీఎన్ చానల్ చర్చలో బీజేపీ జంతువు వంటి విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరిచాలా మంచి పని చేశారు. నా అంచనా ప్రకారం… ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలంతా… క్రూరమృగాళ్లంటి మోడీ, షా చేతుల్లో కీలుబొమ్మలు. వీరంతా కలిసి మన రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్క బీజేపీ నేత చెప్పు దెబ్బలు తినడానికి అర్హుడే. ఎందుకంటే మోడి, షాలు క్రిస్టియన్ రక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు జైలు బయట ఉండటానికి సహకరిస్తున్నారు. వేదిక్ అస్ట్రాలజీలో నాకున్న ప్రవేశాన్ని బట్టి… 2021 జూలై పదో తేదీ కల్లా వీరి ఆటకట్టిపోతుందని నమ్ముతున్నాను.
విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన శ్రీనివాసరావుగారిని మళ్లీ డిబేట్లకు పిలవబోమని ఏబీఎన్ చానల్లో వెంకటకృష్ణ చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన నిర్ణయం. రాధాకృష్ణ నేతృత్వంలోని ఏబీఎన్ చానల్ ప్రతిష్టను ఇది దెబ్బ తీస్తుంది.
అదే స్థానంలో టీవీ5 మూర్తి ఉంటే ఖచ్చితంగా ఆయనను నిషేధించాలనే నిర్ణయం తీసుకోరు. కానీ ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డిని మాత్రం గెంటేసి ఉండేవారు.
విత్ బెస్ట్ విషెస్
ప్రొ. డా. పి.ఎస్.రెడ్డి
టొరంటో, కెనడా