పింక్ బాల్ టెస్ట్‌: తొలిరోజే 13 వికెట్లు

ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.. మొతేరాలో జ‌రుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో బౌల‌ర్లు ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నారు. తొలి రోజే 13 వికెట్లు కూల‌డం… అందుకు నిద‌ర్శ‌నం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేప‌ట్టిన ఇంగ్లండ్ ఏ ద‌శ‌లోనూ భార‌త బౌల‌ర్ల ధాటికి నిల‌వ‌లేక‌పోయింది. కేవ‌లం 112 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. భార‌త బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్.. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్ల న‌ష్టానికి 99 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (57 బ్యాటింగ్‌), రెహానే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

పిచ్ తీరుచూస్తుంటే.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. బ్యాటింగ్ చేయ‌డం క‌ష్టంగా క‌నిపిస్తోంది. భార‌త్ క‌నీసం 100 ప‌రుగుల ఆధిక్యం సంపాదించినా ఈ మ్యాచ్ పై ప‌ట్టు సాధించవ‌చ్చు. నాలుగో ఇన్నింగ్స్ లో ఎంత త‌క్కువ టార్గెట్ నిర్దేశిస్తే.. భార‌త విజ‌యం అంత సుల‌భం అవుతుంది. నాలుగో ఇన్నింగ్స్ లో 200 ప‌రుగుల టార్గెట్ అయినా ఛేదించ‌డం క‌ష్టం అవుతుంద‌ని నిపుణులు భావిస్తున్నారు. తొలి రోజే స్పిన్న‌ర్ల‌కు అనుకూలించిన ఈ పిచ్‌, పేస్ బౌల‌ర్ల‌కూ చ‌క్క‌గా స‌హ‌క‌రిస్తోంది. రెండో రోజు ఉద‌యం… పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ఆ త‌ర‌వాత‌.. బౌల‌ర్ల‌కు స‌హ‌రించే అవ‌కాశం ఉంది. రోహిత్ క్రీజ్ లో ఉండ‌డం, పంత్ ఫామ్ లో ఉండ‌డం భార‌త్‌కు ఊర‌ట క‌లిగించే విష‌యాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close