శ్రీవారికి పోస్కో గ్రూప్ భారీ విరాళం ఇచ్చిందంటూ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో స్టీల్ ప్లాంట్ అంశంలో పోస్కో గ్రూప్ గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో నిజంగానే ఇచ్చి ఉంటారని… స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం.. ఇలా చందాలతో బుట్టలతో వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వర్గం కామెంట్లు పెడుతోంది. అయితే.. నిజానికి శ్రీవారికి రూ. పది కోట్ల విరాళం ఇచ్చింది పోస్కో గ్రూప్ కాదు. పాస్కో మోటార్స్ గ్రూప్ చైర్మన్ సంజయ్ పాసి, షాలిని దంపతులు. నిజానికి ఈ కంపెనీ ఆటోమోబైల్ తయారీ రంగంలో కూడా లేదు.
ఉత్తరాదిలో టాటా వాహనాల డీలర్ షిప్లో ముందు ఉంది. 1967లో రూ. కోటితో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు.. .కొన్నివేల కోట్ల టర్నోవర్ నమోదు చేస్తోంది. ఇది ఓ విజయవంతమైన వ్యాపార సంస్థ. ఉక్కు పరిశ్రమకు.. కొరియాకు చెందిన పోస్కోకు .. ఈ పాస్కో గ్రూప్‌కు సంబంధం లేదు. అయినా పాస్కో.. పోస్కో రెండూ పేర్లు దాదాపుగా ఒకేలా ఉన్నాయన్న ఉద్దేశంతో అవగాహన లేకుండా కొంత మంది ప్రచారం చేసేస్తున్నారు. పోస్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరక్టర్లుగా కొరియన్లే ఉన్నారు.
ఇతర ఇండియన్ కంపెనీలతో జట్టు కట్టినట్లుగా వివరాలు అసలు పాస్కో గ్రూప్ తో జట్టు కట్టినట్లుగా లేవు. దైవ చింతనతో… దక్షిణాదిలో తమ వ్యాపారం లేనప్పటికీ.. పాస్కో గ్రూప్ ప్రతినిధి.. ఎస్వీబీసీ ట్రస్ట్‌కి రూ. 9కోట్లు, సర్వశ్రేయస్సు ట్రస్ట్‌కి కోటి విరాళం ఇచ్చారు. అయినా తొందరపాటుతో.. వారికి పోస్కో గ్రూప్‌తో లింక్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల.. శ్రీవారికి విరాళిచ్చిన వారు బాధపడటం తప్ప..మరో ప్రయోజనం ఉండదు.