అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని …రూ. మూడు వేల కోట్ల రుణం తీసుకోవడానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వైసీపీ నేతలు.. అమరావతిపై తమకు ఎంతో ప్రేమ ఉందని ప్రకటనలు చేశారు. ఎంత అనుమానం ఉన్నా.. అధికార పార్టీ చేస్తుందేమో అన్న ఆశ కొంత మందిలో కలిగింది. గుంటూరు, కృష్ణా కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి ఈ స్కెచ్ వేశారని..కట్టరు..కట్టబోరని విపక్షాలు చెబుతున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా… హఠాత్తుగా శనివారం అమరావతిలో భూకంపం అంటూ.. జగన్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. వైసీపీ సోషల్ మీడియా స్పాన్సర్డ్ పోస్టులతో హోరెత్తించింది. ఇక ఏ మీడియా కూడా అక్కడ భూకంపం.. భూప్రకంపనలు అనే అంశాలను పట్టించుకోలేదు.
అసలు ఈ భూకంపం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆరా తీస్తే.. రాజధాని గ్రామాలకు అవతల కర్లపూడి అనేగ్రామంలో మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన కంపం అని తేలంది. కొంత మంది వైసీపీ నేతలు అనుమతులేమీ లేకుండా పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్తో పేలుళ్లు జరుపుతున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో వారు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో మైనింగ్ కోసం చేశాలో లేకపోతే.. అమరావతి భూకంపం అని ప్రచారం చేయడానికి చేశారో కానీ.. ఒక్క సారే జిలెటిన్ స్టిక్స్ పెద్ద ఎత్తున పేల్చారు. దీంతో అక్కడ పెద్దగొయ్యి ఏర్పడింది. పేలుడు జరిగిన కాసేపటికే.. జగన్ మీడియాలో అమరావతిలో భూకంపం అంటూ ప్రచారం ప్రారంభమయింది.దీన్ని చూసి అమరావతి ప్రాంత వాసులు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది.తమ ప్రాంతం ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారా.. అని ఆశ్చర్యపోయారు.
నిజానికి అలాంటిపేలుడు జరిగితే బాధ్యతుల్ని తక్షణం అరెస్ట్ చేయాలి. కానీపోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని అమరావతి రైతులు అంటున్నారు. మొత్తానికి అమరావతిని కట్టేస్తామంటూ ప్రకటనలు చేసి.. ఏదో విధంగా పాజిటివ్ నెస్ తెచ్చుకుందామనుకున్న అధికార పార్టీ… అమరావతిపై తప్పుడు ప్రచారం చేసే చాన్స్ వస్తే వదులుకోబోమని తేల్చేసి… ప్రజల్లో ఏర్పడిన పాజిటివ్ అనుమానాలను పటాపంచలు చేసింది.