అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి.. ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరించడం ప్రారంభించిన నెలన్నర రోజుల్లో రూ. 2100 కోట్లు జమ అయ్యాయి. దేశవ్యాప్తంగా హిందూ సంస్థల కార్యకర్తలు, బీజేపీ నేతలు… యాక్టివ్‌గా విరాళాల సేకరణ చేపట్టడంతో ఈ ఫీట్ సాధ్యమయింది. అయోధ్యరామ మందిరం నిర్మాణానికి రూ. 2100కోట్లు ఖర్చు కాదు. పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించడానికి రూ. 1100 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఎంత అంచనాలు పెరిగినా మరో రూ. వంద కోట్లు పెరుగుతుందేమో కనీ వేల కోట్లు పెరిగే అవకాశం లేదు. ఈ ప్రకారం చూస్తే… అయోధ్య రాముడికి రెట్టింపు నిధులు ప్రజలు సమకూర్చారని చెప్పుకోవచ్చు.
భారతీయ జనతా పార్టీ నేతలు.. ఆ పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు… ఇతర బడా పారిశ్రామికవేత్తలు అయోధ్య రామ మందిరం కోసం ఉడతా భక్తీ .. రూ. కోట్లు విరాళాలు ఇచ్చారు. ఇస్తున్నారు. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున భక్తితో .. ఎంత పేదవారయినా రూ. వెయ్యి పైనే చదివించుకున్నారు. ఓ ఉద్యమంలా.. ఆరెస్సెస్‌తో పాటు భారతీయ జనతా పార్టీ నేతలు విరాళాలు సేకరించడంతో గ్రాండ్ సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. బలవంతంగా సేకరిస్తున్నారని .. ప్రజల్ని భయపెడుతున్నారని.. విరాళాలు ఇవ్వని వారి ఇళ్లను మార్క్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
అయితే అయోధ్యరామ మందరిరానికి… ట్రస్ట్ ప్రత్యేకంగా చందా పుస్తకాలు పంపిణీ చేసింది. అయితే కొంత మంది మోసగాళ్లు ఈ అంశాన్ని కూడా తమసంపాదనకు వాడుకున్నారు. నకిలీ పుస్తకాలు ముద్రించిచందాలు వసూలు చేశారు. లేకపోతే మరో నాలుగు, ఐదు వందల కోట్లు అయినా ఎక్కువగా వసూలు అయ్యేవని చెబుతున్నారు. నిజానికి రామ మందిరం నిర్మాణం కోసం చందాలు వసూలు చేయాల్సిన పని లేదు. తామే ఆలయాన్ని కట్టిస్తామని కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ ప్రజలు.. భక్తులకు భాగస్వామ్యం కల్పించడానికి చందాలు వసూలు చేస్తున్నటలుగా రామజన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. అందలో భాగంగా వసూళ్లుచేసింది.దీనికి పెద్ద ఎత్తున ప్రజల స్పందన లభించింది.