కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యష్. ఇప్పుడు అందరి దృష్టీ కేజీఎఫ్ 2 పై ఉంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. పార్ట్ 2 బయటకు రాకుండానే, ప్రభాస్ సినిమాతో బిజీ అయిపోయాడు. కేజీఎఫ్‌లో యష్‌ని సూపర్ మాసీగా చూపించిన ప్రశాంత్ ఇప్పుడు ప్రభాస్ ని ఎలా చూపిస్తాడా? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది చిత్రలోకం.
అసలు నిజమేంటంటే.. ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న `సలార్` సినిమా కథ కూడా యష్‌ని ఉద్దేశించి రాసుకున్నదేనట. `కేజీఎఫ్` సమయంలో యష్ కి చెప్పిన కథల్లో ఇదొకటని, యష్.. కేజీఎఫ్‌ని ఎంచుకుని, `సలార్`ని పక్కన పెట్టాడని టాక్. నిజానికి కేజీఎఫ్ చూస్తున్నప్పుడు కూడా.. మన తెలుగు ఆడియన్స్ యష్ స్థానంలో ప్రభాస్ ని ఊహించుకుని ఉంటారు. `ఈ సీన్ లో ప్రభాస్ ఉంటే ఎలా ఉండేదో.` అనిపించచడం చాలా సహజం. ఎందుకంటే ఆ సినిమాలో యష్ బాడీ లాంగ్వేజ్ అలానే ఉంటుంది. ఇప్పుడు యష్ కోసం రాసుకున్న కథ ప్రభాస్ కి చేరింది. కాకపోతే.. ప్రభాస్ ఇమేజ్ వేరు. తన స్టామినా వేరు. దానికి తగ్గట్టే… ప్రశాంత్ నీల్ మార్పులూ, చేర్పులూ చేసి ఉంటాడు.