యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ పరిశీలించారు. నిజానికి ఈ సమయంలో ఆయన పనుల పరిశీలనకు కాదు.. ప్రారంభోత్సవానికి రావాల్సి ఉంది. ఇందు కోసం గతంలో ముహుర్తం ఫిక్స్ చేశారు. కానీ పనులు మాత్రం అనుకున్నట్లుగా సాగలేదు. గత ఏడాది చినజీయర్ స్వామిని కలిసినప్పుడు.. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేయాలని..అప్పటికల్లా యాదాద్రి పనులు పూర్తి చేయాలని ప్రణాళికను స్వామి ముందు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. యాదాద్రి పునర్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
గర్భగుడి మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు అంటున్నారు. కానీ..ఇంకా ఎక్కువే పనులు ఉంటాయని భావిస్తున్నారు. కొద్ది రోజుల కింట.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు… యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి ఆలయం ప్రారంభమైన గంటల్లోనే… కేటీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రకటించారు. గత ఏడాదే ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఫిబ్రవరికి వాయిదా వేశారు.
ఇప్పుడు మే నెలకు వెళ్లింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని కనివినీ ఎరుగని రీతిలో చేయనున్నారు. 1,048 యజ్ఞ కుండాలతో మహా సుదర్శన యాగం కూడా చేయాలని కూడా కేసీఆర్ ప్రణాళికలు వేసుకున్నారు. కానీ నిర్మాణ పనులు మాత్రం ఆయన ఆశించినంత వేగంగా సాగడం లేదు.