హిందూపురంలో నందమూరి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకున్నారు. నిజంగా ఆయన కొట్టకపోతేనే వార్త. కొడితే వార్త ఎందుకవుతుంది. పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతీసారి తన చేతికి పని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన చేతి దెబ్బలు తినేది ఫ్యాన్సే. టీడీపీ కార్యకర్తలే. చెప్పిన మాట వినలేదంటే ఆయనకు కోపం వస్తుంది.. కొట్టేస్తారు. నిజానికి ఇదే ఆయనకు మీడియాలో తెగ పబ్లిసిటీ తీసుకు వస్తోంది. మూడు రోజుల నుంచి హిందూపురంలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోలేదు.
నిజానికి హిందపురంలో బాలకృష్ణ .. ఇతర టీడీపీ నేతల్లా కాదు.. భిన్నమన వ్యూహం అమలు చేస్తున్నారు. ఒక్క ఏకగ్రీవం కూడా కానీయలేదు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. మూడో రోజు… బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టారన్న వీడియో ఇలా బయటకు రావడం ఆలస్యం ఆయన హెడ్ లైన్స్‌లోకి ఎక్కారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. నిజానికి బాలకృష్ణ కొట్టడం అనేది పాత కాన్సెప్టే. కానీ ఎన్నికల సమంయలో కాబట్టి.. ఆయనను ఇబ్బందుల్లో పెట్టాలని ఆయనపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని… ట్రోలర్లు రంగంలోకి దిగారు. బాలకృష్ణ ఇలా ఎప్పుడు ఫ్యాన్స్‌ను కొట్టినా.. కొట్టించుకున్న వారు…కాసేపటికి వీడియో విడుదల చేస్తారు.
కొట్టించుకుంది తానైతే.. మీకేంటి నొప్పి అని అడుగుతారు. ఇక్కడా అదే జరిగింది. కాకపోతే.. సోషల్ మీడియాకు మరింత నచ్చే రీతిలో ఆ దెబ్బతిన్న వ్యక్తి కథ చెప్పారు. దాంతో ఆ యువకుడి వివరణ కూడా హైలెట్ అయింది. మొత్తానికి బాలకృష్ణ హిందూపురంలో చేస్తున్న ప్రచారానికి ఇప్పటి వరకూ సరైన పబ్లిసిటీ రాలేదని బాధపడ్డారేమో కానీ.. విజయసాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు … ఫ్యాన్స్‌కు చెంపదెబ్బకొట్టి… ఒక్క సారిగా లైమ్ లైట్లోకి వచ్చారు.