ఆంధ్రప్రదేశ్ పట్టణాలు ఈజ్ ఆఫ్ లివింగ్‌లో వెనుకబడినా… గ్రామాలు మాత్రం పరిశుభ్రతలో ముందడుగు వేస్తున్నాయి. కేంద్రం బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామాలను రూపొందించాలన్న లక్ష్యంతో స్వచ్ఛ భారత్ -2ను చేపట్టింది. ఇందులో ఏపీ సర్కార్ చాలా ప్రణాళికా బద్దంగా వ్యవహరించింది. అత్యధిక గ్రామాలను పరిశుభ్ర గ్రామాలుగా మార్చింది. ఓడీఎఫ్ ప్లస్ పథకంలో భాగంగా బహిరంగ మూత్ర విసర్జన లేని గ్రామాలు దేశవ్యాప్తంగా 1,060 గ్రామాలను గుర్తించగా.. అందులో సగానికి పైగా మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి .. కమ్యూనిటీ మరుగుదొడ్లు … అన్నింటికీ పారుదల వ్యవస్థ ఉండటం వీటిలో భాగం.
రోడ్లపై మురుగు నీరు నిలబడకుండా, చెత్తచెదారం లేకుండా చూడడం.. గ్రామస్తులందరూ వంద శాతం మరుగుదొడ్లు వినియోగించడం వంటి ఎనిమిది అంశాలను రేటింగ్‌కు ప్రాతిపదికగా తీసుకుంటారు. కేంద్ర ప్రమాణాలకు తగ్గట్లుగా రాష్ట్రంలో పూర్తి పరిశుభ్ర గ్రామాలుగా 680 పల్లెలను గుర్తించారు. ఏపీ తర్వాత హర్యానా… ఉంది. కానీ.. ఏపీ పల్లెలలతో పోలిస్తే రెండో వంతు కూడా… లేవు. తెలంగాణలో కేవలం 22 మాత్రమే పరిశుభ్రంగా పేరు తెచ్చుకున్నాయి. 24 రాష్ట్రాలు ఒక్క గ్రామం కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి.
ఏపీలో పద్దెనిమిది వేలకుపైగా గ్రామాలున్నాయి. అన్నింటినీ శుభ్రంగా మార్చేందుకు ఏపీ సర్కార్… ప్రత్యేక కార్యక్రమాల్ని అమలుచేస్తోంది. తొలి విడతగా.. మండలానికి రెండేసి గ్రామాలు చొప్పున ఓడీఎఫ్ ప్లస్‌గా మార్చారు. రెండో విడతలో 4,737 గ్రామ పంచాయతీల్లో గత డిసెంబరు నుంచి శ్రీకారం చుట్టింది. స్థానికులను భాగస్వాములను చేస్తూ తొలి 15 రోజులపాటు ప్రజాచైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ముందు ముందు అత్యధిక గ్రామాలను.. పరిశుభ్రంగా మార్చాలని.. ఏపీ సర్కార్ పట్టుదలగా ఉంది.