ఐపీఎల్ 14వ సీజన్ ఇండియాలోనే జరుగుతోంది. టైం ప్రకారమే ప్రారంభం అవుతోంది. ఏప్రిల్ తొమ్మిది నుంచి టోర్నీ జరుగుతుంది. కానీ ఈ సారి అసలు షాక్ మాత్రం హైదరాబాదీలకు తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ హోంగ్రౌండ్‌గా హైదరాబాద్ లేదు. ఆ జట్టు యాజమాన్యం అయిన సొంత రాష్ట్రం చెన్నైనే ఉంది. మొత్తం ఆరు వేదికల్లో మాత్రమే ఐపీఎల్ నిర్వహించాలని… నిర్ణయించారు. కరోనానే కారణం. ఆ ఆరు వేదికల్లో హైదరాబాద్ లేదు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను ఇందుకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌ను ఓ వేదికగా ఉంచాలని.. కరోనా పూర్తిగా కంట్రోల్లో ఉందని ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ బీసీసీఐకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడామద్దతు తెలిపింది. అయితే.. బీసీసీఐ .. కేటీఆర్ విజ్ఞప్తిని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్ నిర్వహణ విషయంలో కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా మహారాష్ట్ర సర్కార్ వెనుకంజ వేస్తుందేమోనని.. ఆ చాన్స్ హైదరాబాద్‌కు వస్తుందేమోనని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర సర్కార్ ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీందో హైదరాబాద్‌కు నిరాశే మిగిలింది. సన్ రైజర్స్ టీంలో హైదరాబాదీలు ఎవరూ లేరని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మ్యాచ్‌లు కూడా.. హైదరాబాద్‌లో జరగబోవడం లేదు.
సన్ రైజర్స్ యాజమాన్యం తమిళనాడుకు చెందిన వారు. ఈ సీజన్ లో వారి హోంగ్రౌండ్‌గా చెన్నైనే ఉంటోంది. దీంతో.. పేరుకు మాత్రమే హైదరాబాద్ తప్ప.. మరే విధంగా ఐపీఎల్‌తో ఈ సారి అనుబంధం లేకుండా పోయింది. ఎంపిక చేసిన ఆరు వేదికల్లో అహ్మదాబాద్‌కు అగ్ర తాంబూలం దక్కింది. ఫ్లేఆఫ్స్ తో పాటు ఫైనల్ కూడా.. మొతేరా స్టేడియంలోనే జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్, పంజాబ్ జట్లు తమ హోం గ్రౌండ్లలో ఆడలేకపోతున్నాయి.