లెజెండ్‌తో.. జగపతిబాబులోని విలన్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జగపతి బాబు కెరీర్ టర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విలన్ గా మారాక మాత్రం జగపతి ఆస్తులు పెరిగాయి. ఈ విషయం ఆయనే చెప్పాడు. అప్పటి `జయ జానకీ నాయక` పాత్రలోనూ.. విలన్ గానే కనిపించాడు జగపతి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలోనూ జగపతికి ఓ కీలకమైన పాత్ర ఇచ్చాడు. బోయపాటి సినిమాలో జగపతి అనగానే.. ఈసారీ విలన్ ఏమో అనుకున్నారంతా. అయితే.. ఈసారి మాత్రం పక్కా పాజిటీవ్ పాత్రలో కనిపించబోతున్నాడట. బాలయ్యకు కుడిభుజం లాంటి పాత్రలో జగపతి కనిపిస్తాడని, తన పాత్రనే ఈ కథలో కీలకమైన మలుపుకు కారణం అవుతుందని తెలుస్తోంది. బోయపాటి ప్రతి సినిమాలోనూ హీరోకి ఓ గ్యాంగ్ ఉంటుంది. అందులో అంతా మంచివాళ్లే. ఈ సినిమాలో ఆ గ్యాంగ్‌లో జగపతిబాబు ఉంటాడట. శ్రీకాంత్ ప్రధాన విలన్ అయినా, ఈ సినిమాలో చాలామంది విలన్లు కనిపిస్తారని టాక్. మేలో బాలయ్య సినిమా విడుదల కాబోతోంది. శివరాత్రికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు.