మెగాస్టార్ చిరంజీవి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు పలికారు. ఇది ఆయన ఫ్యాన్స్‌ను సంతృప్తి పరిచింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతున్న వారికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే సోషల్ మీడియాలో కొంత మంది ఆయన స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేశారని అబద్దాలు చెబుతున్నారని కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన పోస్టులో తాను వైఎన్ఎం కాలేజీలో చదివేల సమయంలో గోడులపై విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదాలు రాశామని.. బంద్‌లు, హర్తాళ్లు చేశామని పేర్కొన్నారు. ఈ అంశంపైనే కొంత మంది రంధ్రాన్వేషణ చేస్తున్నారు. చిరంజీవి డిగ్రీ చదివింది ఎప్పుడు… అసలు స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరిగింది ఎప్పుడు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 1960-70ల మధ్య తెలుగువారిలో ఉరకలెత్తింది. 1966లో కాల్పులు జరిగాయి. 1970లో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిరంజీవి వైఎన్ఎమ్ కాలేజీలో డిగ్రీ చదివారు. అయితే ఆయన డిగ్రీ చదివింది.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రకటన తర్వాతేనని. .అప్పుడు ఉద్యమం ఎక్కడ ఉందని.. ఆయన ఎక్కడ స్లోగన్లు.. బంద్‌లలో పాల్గొన్నారని ప్రశ్నిస్తున్నారు. 1972 నాటికి స్టీల్ ప్లాంట్ విజయోత్సవాలే ఉన్నాయని వారంటున్నారు. అందుకే చిరంజీవి తాను డిగ్రీ చేసే సమయంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నానన్నది అబద్దమని వారంటున్నారు. ఈ అంశంపై సోష్ల మీడియాలో వాదోపవాదాలు జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి వైఎన్ఎం కాలేజీలో చదివేటప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు.. ఒంగోలు సీఎస్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారా అనేది ముఖ్యం కాదు. ఆయన ఇప్పుడు తాను స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నట్లుగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్రెడిట్ కూడా ఆయన కోరుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో మానసిక బంధం ఉన్న వ్యక్తిగా తన వంతుగా స్పందించారు. ఆ స్ఫూర్తిని తీసుకోవాలి కానీ.. ఆయనేదో అబద్దపు క్లెయిమ్‌లు చేసుకుంటున్నారు.. ఈకలు పీకడం కరెక్ట్ కాదనేది కొంత మంది వాదన.
Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions.
With a Steely resolve,
Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021