తెలుగులో నెంబర్ వన్ కథానాయికగా వెలుగొందుతోంది సాయి పల్లవి. అగ్ర హీరోల సరసన నటిస్తూ… భారీ పారితోషికం అందుకుంటూ – దూసుకుపోతోంది. ఇప్పుడు సాయి పల్లవి జిరాక్స్ లాంటి మరో హీరోయిన్ కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. తనే.. పూజా కన్నన్. సాయి పల్లవికి స్వయంగా చెల్లాయి. అచ్చం ఇద్దరూ ఒకేలా ఉంటారు. ప్రస్తుతం పూజా.. తన తొలి సినిమా పై సంతకం చేసేసింది. తమిళ చిత్రంతో కథానాయికగా అడుగుపెడుతోంది.
కొరియోగ్రాఫర్ ‘స్టంట్’ సిల్వా దర్శకుడిగా మారారు. ఆయన సినిమాలోనే… పూజా హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు విజయ్.. కథ, స్క్రీన్ ప్లే `అందించడం విశేషం. సముద్రఖని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల చేయనున్నారు. మరో వైపు ఓ తెలుగులోనూ… పూజా ఓ సినిమా చేయబోతోందని సమాచారం. చూస్తుంటే.. సాయి పల్లవిలానే చెల్లాయి కూడా బిజీ అవుతుందనిపిస్తోంది. అయితే అక్క హీరోయిన్ అయితే, చెల్లాయిలు రాణించిన సందర్భాలు తెలుగులో చాలా తక్కువ. ఆర్తి అగర్వాల్, కాజల్ అగర్వాల్ చెల్లాయిలు కూడా హీరోయిన్లుగా అవతారం ఎత్తారు. కానీ.. ఒకట్రెండు సినిమాలతోనే తట్టాబుట్టా సర్దేశారు. మరి.. పూజా ఏం చేస్తుందో?