చిరంజీవి మాస్ హీరో. ఈ విషయంలో తిరుగులేదు. కాకపోతే… తన కామెడీ టైమింగ్ క్లాసీగా ఉంటుంది. చిరు సూపర్ హిట్ సినిమాల్లో అదిరిపోయే కామెడీ ట్రాకులున్నాయి. అందులో చిరు పంచిన వినోదం.. ఇప్పటికీ ఎవర్ గ్రీనే. తాజాగా `ఆచార్య`లోనూ చిరు కొన్ని కామెడీ సీన్లలో భలే నవ్వించేశాడని టాక్. ముఖ్యంగా చిరంజీవి – వెన్నెల కిషోర్ మధ్య నడిచే కామెడీ ట్రాక్ `ఆచార్య`కే హైలెట్ గా నిలవబోతోందని తెలుస్తోంది. `ఆచార్య` సీరియస్ ఎమోషన్ తో సాగే కథ. అయితే… అక్కడక్కడ చిరు మార్క్ కామెడీ కూడా ఉంటుందట. చిరు గ్యాంగ్ లో బెనర్జీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి.. ఉంటారని. వాళ్లతో చిరు చేసే కామెడీ సీన్లు బాగా వచ్చాయని తెలుస్తోంది. ఈ కామెడీ ట్రాక్ పై కొరటాల శివ ప్రత్యేక దృష్టి పెట్టాడు. తను స్వతహాగా రచయిత. అయినా సరే.. ఈ సన్నివేశాల్ని మరో రచయిత శ్రీధర్ సిపాన తో రాయించాడు. ఈ సినిమాలోని కామెడీ ట్రాకులన్నీ శ్రీధర్ రాసినవే. చిరు – వెన్నెల కాంబినేషన్ సెట్టవ్వడం ఇదే తొలిసారి. మరి వీళ్ల కెమిస్ట్రీ ఎలా సాగిందో చూడాలి.