చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించి కేసు నమోదు చేయలేదు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లుగా ఉంది. ఫిబ్రవరి 24న మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి టైప్ చేసుకు వచ్చిన మ్యాటర్‌తో ఫిర్యాదు చేశారని.. దానిపై కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు జరిపామని పోలీసులు అందులో తెలిపారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు తన నియోజకవర్గంలోని కొంత మంది రైతుల వద్ద కొంత మంది కొంత మంది పలుకుబడి గల వ్యక్తులు తమ పలుకుబడి ఉపయోగించి.. బెదిరించి భూములు కొనుగోలు చేశారు. అమ్మకపోతే ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మధ్యవర్తులు బెదిరించడంతో వారంతా అమ్ముకున్నారని పోలీసులు ఎఫ్ఆర్లో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు జీవోలను పరిశీలించారు. జీవోలను పరిశీలించిన తర్వాత అక్రమాలు ఉన్నట్లుగా ప్రాధమిక విచారణలో తేలిందని నివేదిక రావడంతో పన్నెండో తేదీన కేసులునమోదు చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మొత్తం ఫిర్యాదులో అసైన్డ్ ల్యాండ్స్ అమ్ముకున్న రైతుల పేర్లు లేవు. కొనుగోలు చేసిన వారి పేర్లు లేవు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేసినట్లుగా లేదు. జీవోల్లో తప్పులున్నాయని కానీ.. మరొకటి కానీ ప్రభుత్వ పరంగా ప్రొసీడింగ్స్ లో తప్పులున్నాయని కానీ చెప్పలేదు. అయితే.. అసైన్డ్ భూములు అమ్ముకున్న వారు నష్టపోయారని మాత్రం.. సీఐడీ పోలీసులు తేల్చి.. నోటీసులు జారీ చేశారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చంద్రబాబుతోపాటు నాటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణతో పాటు… అప్పటి గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్ దండేకు కూడా.. ఇరవై మూడో తేదీన హాజరు కావాలని నోటీసులుజారీ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రాజధాని భూములపై ఇప్పటికే అనేకానేక విచారణలు చేసినా ఎలాంటి కేసులు పెట్టలేకపోవడంతో.. ఈ సారి రూటు మార్చి.. బాధితులు ఎవరూ లేకుండానే….తన నియోజకవర్గం పేరుతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయడం… న్యాయవర్గాలకు సైతం కొత్తగా అనిపిస్తోంది. ఇలా కూడాకేసులు పెట్టొచ్చా.. అన్న ఆశ్చర్యం వారిలో వ్యక్తమవుతోంది.