పవన్ కల్యాణ్ ని రొమాంటిక్ లుక్ లో చూసి చాలా రోజులైంది. ఈమధ్య పాలిటిక్స్ లో పడిపోయి.. తన లుక్ పై పవన్ అశ్రద్ధ చేశాడు. అయితే ఆ లోటు `వకీల్ సాబ్`తో తీరిపోనుంది. ఇందులో పవన్ లుక్ ఇప్పటికే అభిమానులకు నచ్చేసింది. తాజాగా `కంటిపాప` అనే కొత్త పాటని విడుదల చేసింది చిత్రబృందం. పాట సంగతి పక్కన పెడితే.. కొన్ని షాట్స్ లో వింటేజ్ పవన్ కనిపించాడు అభిమానులకు. శ్రుతిహాసన్ తో కలిసి కొన్ని రొమాంటిక్ షాట్స్‌లో అలరించాడు. ఈ పాటలో మెలోడీకి క్లాసికల్ టచ్ ఇచ్చాడు పవన్. కథలో… హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే పాట ఇది. కథానాయిక శ్రుతిహాసన్ ని క్లాసికల్ డాన్సర్ గా ఈ పాటలోనే ఇంట్రడ్యూస్ చేయనున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పొయెటిక్ గా సాగింది. ఆర్మాన్ మాలిక్, దీపు, తమన్… ఇలా ముగ్గురు సింగర్స్ ఈ పాట పాడేశారు. ఆర్కెస్ట్రేజేషన్ చాలా సింపుల్ గా.. టచింగ్ గా ఉంది. తెరపై హీరో, హీరోయిన్లపై ఉండే పాట ఇదొక్కటే. ఇప్పటి వరకూ `వకీల్ సాబ్` నుంచి మూడు పాటలొచ్చాయి. మూడూ భిన్నమైనవే. మరో రెండు పాటలు ఈ ఆల్బమ్ నుంచి రాబోతున్నాయి.