త్వరలో తెలుగు తెరపై ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ చూడబోతున్నాం. అదే.. బాలకృష్ణ – సాయి పల్లవి. ఇద్దరూ తండ్రీ కూతుర్లుగా నటించబోతున్నారు. ఓ యువ దర్శకుడు.. ఓ కథ తయారు చేసుకున్నాడు. కూతురి కోసం పోరాడే తండ్రి కథ అది. తండ్రి పాత్రలో బాలయ్య అయితే బాగుంటుందని ఆయన బాలయ్యని సంప్రదించారని సమాచారం. ఈ కథ బాలయ్యకు బాగా నచ్చిందట. కూతురిగా ఓ స్టార్ హీరోయిన్ కావాలి. ఆ పాత్రలో సాయి పల్లవి బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడు. అయితే సాయి పల్లవిని ఇప్పటి వరకూ సంప్రదించలేదు. `దృశ్యం` టైపులో సాగే కథ ఇది. మైండ్ గేమ్ ఉండదు గానీ, రివైంజ్ డ్రామాగా సాగుతుంది. బాలయ్య సరసన ఓ సీనియర్ హీరోయిన్…అంటే మీనా, రమ్యకృష్ణలాంటి నటి కనిపించే ఛాన్సుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉందీ సినిమా. అన్నీ కుదిరితే.. 2022లో పట్టాలెక్కొచ్చు.