సీతాకోక చిలుక, అభినందన లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న కార్తీక్ గుర్తున్నాడు గా? ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. తీవ్రమైన శ్వాస కోస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కార్తీక్ ని చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మనిద ఉరిమై కట్చి అనే పార్టీ స్థాపించి, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. త్వరలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఆయన అన్నాడీఎంకే బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించారు. ఆ పార్టీ తరపున ఆదివారం ప్రచారం కూడా నిర్వహించారు. అప్పుడే ఆయన అస్వస్థతకు లోనయ్యారని సమాచారం. కార్తీక్కి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటీవ్ రిపోర్ట్ వచ్చింది.