కొత్త ఎస్ఈసీగా నీలం సహానిని నియమించే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. నిమ్మగడ్డ పదవీ విరమణ చేయడానికి వారం రోజుల ముందే… గవర్నర్‌కు ప్రభుత్వం ప్రాబబుల్స్ పంపింది. ఈ జాబితాలో మొదటి పేరు నీలం సహానీదే ఉంది. తర్వాత ప్రేమ్ చంద్రారెడ్డి, తర్వాత శామ్యూల్ అనే రిటైర్డ్ అధికారుల పేర్లు ఉన్నాయి. ప్రభుత్వం ఎవర్ని నియమించాలనుకుంటే… గవర్నర్ వారికి ఆమోదముద్ర తెలుపుతారు. అందులో ఎలాంటి దాపరికాలు ఉండవని.. గతంలో.. కనగరాజ్‌ను నియమించినప్పుడే తేలిపోయింది. ప్రభుత్వం నీలం సహాని వైపు మొగ్గు చూపుతోందా లేకపోతే.. ప్రేమ్ చంద్రారెడ్డిని నియమించాలనుకుని.. ఆమె పేరును… ప్రక్రియలో భాగంగా పంపించారా అన్నదానిపై క్లారిటీ లేదు.
ఎందుకంటే… చీఫ్ సెక్రటరీగా నీలం సహానీ రిటైరైన తర్వాత సీఎం జగన్.. ఆమె సేవలను మెచ్చి… ప్రభుత్వ ముఖ్య సలహదారుగా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే ఎక్కువ జీతం నిర్ణయించారు. ఈ క్రమంలో వెంటనే.. ఆమెను మళ్లీ ఎస్ఈసీగా నియమిస్తారా అన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎస్ఈసీగా నియమితులు అయ్యే వారు.. పరిషత్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అది కూడా పదవి చేపట్టిన వెంటనే నిర్వహించాలి. ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఎన్నికల ప్రక్రియకు సీఎస్‌గా ఉన్నప్పుడు నీలం సహాని సహకరించలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది.
ఇలాంటి సమయంలో ఆమె ఎస్ఈసీ అయితే..అలాంటి చిక్కులన్నింటీకీ తెరపడవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ముగ్గురి పేర్లలో సీఎం జగన్ నిజంగా నీలం సహానిని ఎస్ఈసీగా కోరుకుంటున్నారా లేక ప్రేమ్ చంద్రారెడ్డినా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ నియామకాల సరళిని పరిశీలించిన వారు ఎక్కువ మంది ప్రేమ్ చంద్రారెడ్డినే ఎస్ఈసీగా నియమిస్తారని భావిస్తున్నారు.