ఈ వేసవి మామూలుగా ఉండేలా లేదు. వరుసగా అన్నీ పెద్ద సినిమాలే. ఆ పెద్ద సినిమాల జాతర ఏప్రిల్ 9 నుంచి మొదలు కాబోతోంది. ఆరోజే `వకీల్ సాబ్` వస్తోంది. పవన్ కల్యాణ్ నుంచి ఓ సినిమా వచ్చి చాలా కాలమైంది. అందుకే పవన్ ఫ్యాన్స్ `వకీల్ సాబ్` కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు `వకీల్ సాబ్` ప్రమోషన్లు కూడా మొదలైపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 పాటలొచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 29న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈసాయింత్రం 5 గంటలకు వకీల్ సాబ్ కి సంబధించిన అప్ డేట్ ఇస్తానని చిత్రబృందం ప్రకటించింది. అది ట్రైలర్‌కి సంబంధించిన న్యూసే. ఈనెల 29 సాయింత్రం `వకీల్ సాబ్` ట్రైలర్ రిలీజ్ చేయడానికి చిత్రబృందం అన్నిరకాలుగా సన్నద్ధమైంది. ఆ తరవాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్‌లు పాల్గొంటారని తెలుస్తోంది. వాళ్లొస్తే… పబ్లిసిటీ పీక్స్‌కి వెళ్లిపోయినట్టే.