ఈ శుక్రవారం విడుదల అవుతున్న చిత్రాల్లో `రంగ్ దే` కూడా ఉంది. `అరణ్య` నుంచి ఈ సినిమాకి మంచి పోటీ ఎదురు కానుంది. అయితే.. యూత్ ఛాయిస్ `రంగ్ దే` వైపే ఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇందో రొమాంటిక్ ఎంటర్టైనర్. ప్రచార చిత్రాలు బాగున్నాయి. నితిన్ – కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీ వర్కవుట్ అయి, ఎంటర్టైన్ చేస్తే సినిమా హిట్టే.
ఈ సినిమాలో నితిన్ న్యూడ్ గా కనిపించనున్నాడని ఓ రూమర్ ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ కూడా `అవును.. ఓ షాట్ లో అలా కనిపిస్తా` అని హింట్ ఇచ్చాడు. అయితే.. అదేం న్యూస్ సీన్ కాదు. ఓ సన్నివేశంలో కథ ప్రకారం నితిన్ – కీర్తి…ల మధ్య ఇంటిమేట్ సీన్ ఒకటుంది. ట్రైలర్ లోనూ దాన్ని చూపించారు. ఆ సమయంలో నితిన్ చొక్కా లేకుండా ఒకే ఒక్క షాట్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దాన్నే నితిన్ `న్యూడ్` సీన్ అనేశాడు. బహుశా ఈ సినిమాపై ఎక్స్ట్రా ఎట్రాక్షన్ పెకగడానికి.. నితిన్ ఈ టైపు పబ్లిసిటీ మొదలెట్టి ఉంటాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు