జానారెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు టీఆర్ఎస్లో చర్చనీయాంశం అవుతోంది. ఆ సవాల్‌పై స్పందించకుండా ఇతర అంశాలపై జానారెడ్డిపై నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం జానారెడ్డి సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకూ జానారెడ్డి చేసిన సవాల్ ఏమిటంటే… నామినేషన్లు వేసి.. అందరం ప్రచారం చేయకుండా సైలెంట్‌గా ఉందా.. ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినవారికి ఓట్లు వేయనిద్దాం.. ఎవరు గెలుస్తారోచూద్దామన్నది ఆ సవాల్ సారాంశం. ఇదేదో బాగున్నట్లు అనిపించినా.. టీఆర్ఎస్ నేతలకుమాత్రం నచ్చలేదు. దాంతోజానారెడ్డి ఔట్ డేటెడ్ అంటూ విమర్శలు ప్రారంభించారు కానీ.. ఆ సవాల్‌కు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు.
టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంత వరకూ ఖరారు చేయలేకపోయారు. ఎవరిని ఖరారు చేసినా.. ఇంకో ఆశావహుడు బీజేపీలోకి వెళ్లిఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారన్న అంచనాల మధ్య కేసీఆర్ ఏ విషయాన్నీ తేల్చడం లేదు. నోముల నర్సింహయ్య కుమారుడు నోములభగత్కే టిక్కెట్ ఖరారు చేసినట్లుగా అంతర్గతంగా పార్టీ నేతలకు సమాచారం అందింది.కానీ ఆశావహులుకు కూడా సంకేతాలువెళ్తున్నాయి. దీంతోవారుకూడా వేచి చూస్తున్నారు. అయితే జానారెడ్డి మాత్రం.. ఈ విషయంలో చాలా ముందు ఉన్నారు. ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసేశారు. గ్రామ గ్రామాన ఉన్న అనుచరులతో పరస్థితుల్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల బరి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేపరయింది. అందులో భాగంగా.. సవాళ్లు నడుస్తున్నాయని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. బీజేపీకి చోటు లేదని చెప్పడానికి … వచ్చిన హైప్‌ను తగ్గించడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే కౌంటర్‌గా… టీఆర్ఎస్ నేతనే అక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ప్రణాళికతో ఉంది. మొత్తానికి సాగర్ ఎన్నికలో ఎత్తులు..పై ఎత్తులురాజకీయ చదరంగంలో ఆసక్తి రేపుతున్నాయి.