నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు రెండు మేజర్ సర్జరీలు అవసరం కావడంతో చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వాటిని పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ కానీ..రేపు కానీ ఆమెను జనరల్ వార్డుకు మారుస్తారని… రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. రోజా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. కరోనా కారణంగా ఎవరూ… పరామర్శకు రావొద్దని ఆయన కోరారు. రోజా అనారోగ్యం పాలైన విషయం చాలా మందికి తెలియదు. సెల్వమణి అసలు విషయం చెప్పిన తర్వాతనే తెలిసింది.
నగరి నుంచి రెండో సారి గెలిచిన ఎమ్మెల్యేరోజా.. ఆతర్వాత అనారోగ్యానికి గురయ్యారు. అయితే అవి ఎలాంటి అనారోగ్య సమస్యలన్నదానిపై క్లారిటీ లేదు. ఆపరేషన్ చేయించుకోవాలని గతంలో వైద్యులు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే స్థానిక ఎన్నికల కారణంగా… నగరిలో ఉన్న గ్రూపు రాజకీయాల పరిస్థితుల కారణంగా ఆమె సర్జరీలను వాయిదా వేసకున్నట్లుగా తెలుస్తోంది. పరిషత్ ఎన్నికలు ఉన్నప్పటికీ.. ఇంకా ఆలస్యం చేస్తే.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఇప్పుడు ఆపరేషన్ పూర్తి చేయించుకున్నారు.
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజా… ప్రత్యర్థులపై తిట్లతో విరుచుకుపడటంలో తనదైన మార్క్ ఏర్పర్పుచుకున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా… తన టంగ్ పవర్‌ను విపక్షాలపైనే కాదు… స్వపక్షంలోని వ్యతిరేకులపైనా చూపించారు. మంత్రి పదవికి గట్టిగా పోరాడుతున్న ఆమె.. ఈ సారి జగన్ చాన్సిస్తారని గట్టిగా ఆశ పడుతున్నారు. ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్ పదవిలో ఉన్నారు.