తెలుగమ్మాయి అంజలికి టాలీవుడ్ లో మంచి అవకాశాలే దక్కాయి. కొన్నిసార్లు బాగా వాడుకుంది. కొన్నిసార్లు ఆమె టాలెంట్ ని సినిమాలు వాడుకోలేకపోయాయి. ప్రస్తుతానికైతే.. అడపా దడపా వచ్చి పోతోంది. `వకీల్ సాబ్` ఓరకంగా అంజలికి దక్కిన పెద్ద అవకాశం. ఈ సినిమాతో తన అదృష్టం మారుతుందని చాలామంది నమ్ముతున్నారు. ఇకనైనా తాను రేసులోకి వస్తుందని భావిస్తున్నారు. అంజలి మాత్రం `నేను ఎప్పటినుంచో రేసులోనే ఉన్నా` అంటోంది.
‘టాలీవుడ్ లో నాకు మంచి అవకాశాలే వచ్చాయి. అన్ని రకాల పాత్రలూ చేశాను. హీరోయిన్ గా కనిపించా. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశా. హారర్ కథలూ చేశా. అవకాశాల పరంగా ఎప్పుడూ అసంతృప్తికి లోను కాలేదు. ఎవరో పోటీకి వచ్చేస్తున్నారని కూడా భయపడలేదు. నాకంటూ కొన్ని అభిరుచులు ఉన్నాయి. వాటి మేరకే సినిమాల్ని ఒప్పుకుంటాను. నాకు రావల్సిన పాత్రలు నాకే దక్కుతాయి. తెలుగులో త్వరలోనే ఓ పెద్ద సినిమా చేయబోతున్నా. ఆ వివరాలు త్వరలోనే చెబుతా” అంటోంది అంజలి.