బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ ని తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈనెల 9న విడుదల అవుతోంది. పవన్ కల్యాణ్ కోసం.. పింక్ కథలో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. కమర్షియల్ పాయింట్లు జోడించారు. అందులో ఫైట్స్ చాలా కీలకం. `పింక్`లో ఫైట్స్లేవు. కానీ `వకీల్ సాబ్`లో 5 ఫైట్స్ ఉన్నాయట. విశ్రాంతికి ముందు 3.. ఆ తరవాత 2 ఫైట్లూ ఉండబోతున్నాయి.
పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సీనే ఓ ఫైట్‌తో అని సమాచారం. ఓ ఇంట్లో రౌడీ మూక చేరి సామాన్లన్నీ విసిరేస్తుంటార్ట. వివేకానందుడి ఫొటో విసిరేస్తున్నప్పుడు ఆ ఫొటోని గాల్లోనే ఓ చేయి వచ్చి పట్టుకుంటుందట. ఆ చేయి… పవన్ కల్యాణ్ ది. ఈ ఫైట్ ని మంచి క్లాసీ లుక్ తో తెరకెక్కించారని టాక్. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కల్యాణ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.