నాగచైతన్య – సమంత జంటగా నటించిన చిత్రం `మజిలీ`. భర్త బేవార్సు.. భార్య ఉద్యోగస్థురాలు. అదే మజిలీ కథ. సహజనంతో భర్తని ప్రేమతో మార్చుకుంటుంది. ఇప్పుడు నాగచైతన్య – సాయి పల్లవి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులోనూ సేమ్ అదే లైన్ అని సమాచారం. కాకపోతే…. చైతూ – సాయి పల్లవి భార్యాభర్తలు కాదు. జస్ట్… ప్రేమికులు.
చైతూ ఉద్యోగం లేక డీలాగా ఉంటాడు. ఆవారాగా తిరుగుతుంటాడు. సాయిపల్లవి ఉద్యోగస్థురాలు. ఏ గమ్యమూ లేకుండా నాగచైతన్యని.. సాయి పల్లవి ఎలా మార్చిందన్నదే కథ. శేఖర్ కమ్ముల సినిమాల్లో గొప్ప గొప్ప పాయింట్లే ఉండవు. భావోద్వేగాలూ, అనుభూతులే కనిపిస్తాయి. అందుకే తాను ఇది వరకు చేసిన కథనే అయినా… మళ్లీ ఒప్పేసుకున్నాడేమో. `మజిలీ`లో ఇంట్రవెల్ తరవాత సినిమా మొత్తాన్ని సమంత తన వైపుకు తిప్పుకుంటుంది. అయితే.. `లవ్ స్టోరీ`లో మాత్రం ముందు సీన్ నుంచి సాయి పల్లవినే డామినేట్ చేస్తుంటుందట. ఈ రెండు సినిమాల మధ్యా.. అదో వ్యత్యాసం ఉంది. మరి.. `మజిలీ`లోనూ `లవ్ స్టోరీ`లోనూ ఇంకెన్ని పోలికలు కనిపిస్తాయో.. సినిమా విడుదలయ్యేక లెక్కలేయాలి.