`చావు కబురు చల్లగా` రిలీజ్ హడావుడిలో.. అంతే హడావుడిగా ఓసినిమా ప్రకటన వచ్చేసింది. అది సుకుమార్ బ్యానర్లో కార్తికేయ సినిమా. దర్శకుడు లేడు, కథ లేదు.. అయినా… సినిమా ప్రకటించేశారు. అక్టోబరులో సినిమా పట్టాలెక్కుతుందని, సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తారని అన్నారు. అయితే.. ఈ సినిమా లేదని తేలిపోయింది. కార్తికేయతో సుకుమార్ సినిమా చేయడం లేదని – ఈ సినిమా కేవలం ప్రకటనలకే పరిమితం అని ఇండ్రస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సుకుమార్ కి ఉన్న టైట్ షెడ్యూల్ వల్ల.. కొత్త కథలపై, కొత్త సినిమాలపై దృష్టి పెట్టడం కష్టం అవుతోంది. ఇప్పటికే కొంతమందికి సుకుమార్ మాటిచ్చాడు. తన బ్యానర్లో ఓ సినిమా వస్తోందంటే.. అన్ని అంశాలూ తానే దగ్గరుండి చూసుకోవడం సుకుమార్ శైలి. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో మరో సినిమాపై ఫోకస్ చేయడం ఇష్టం లేక… ఈ సినిమా చేయడం లేదని టాక్. అయితే… కేవలం `చావు కబురు చల్లగా` సినిమా ప్రమోషన్ల కోసం, ఆ సినిమా హైప్ కోసం.. ఇలాంటి ప్రకటనలు సృష్టించి ఉంటారని మరో వాదన.