స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు. తనకు కరోనా సోకిందని, తనని ఇటీవల కలసిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. `ఆర్.ఆర్.ఆర్`కి విజయేంద్ర ప్రసాద్ రచయిత అనే సంగతి తెలిసిందే. ఆయన టీమ్ తో తరచూ కలుస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో.. ఆర్.ఆర్.ఆర్ టీమ్ లోని కీలకమైన సభ్యులు ఇప్పుడు మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సివస్తోంది. రాజమౌళి కుటుంబానికి కరోనా కొత్త కాదు. కరోనా వచ్చిన కొత్తలోనే రాజమౌళి, కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. అయితే.. తగిన జాగ్రత్తలు తీసుకుని బయటపడ్డారు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ వంతు వచ్చింది. ఏదైమైనా ఇటీవల కరోనా ఇంకొంచెం గట్టిగా విజృంభిస్తోంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలను అంటుకుని తిరుగుతోంది. ఈ విషయమై.. స్టార్సంతా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.