దర్శకుడు శోభన్ తనయుడు.. సంతోష్ శోభన్. `తను నేను`తో హీరోగా అవతారం ఎత్తాడు. ఆ తరవాత `పేపర్ బోయ్`గా కనిపించాడు. రెండూ ఫ్లాపులే. ఓ యువ హీరో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోకి వరుసగా రెండు ఫ్లాపులొస్తే, కెరీర్ ఖతం అయిపోవాల్సిందే. కానీ… ఇక్కడే శోభన్ సుడి తిరిగింది. యూవీ క్రియేషన్స్ దృష్టిలో పడ్డాడు. `ఏక్ మినీ కథ` అనే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. యూవీ బ్యానర్లోనే ఇప్పుడు మరో సినిమా ఓకే చేసేసుకున్నాడు. అంతే కాదు… మెగా డాటర్ సుస్మిత ప్రొడక్షన్ హోస్ స్థాపించిన సంగతి తెలిసిందే. తన బ్యానర్లో ఓ వెబ్ సిరీస్ మొదలెట్టింది. ఇప్పుడో సినిమా కూడా చేస్తోంది. హీరో.. శోభన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిపోయింది. త్వరలోనే ప్రమోషన్లు మొదలెడతారు. యూవీ క్రియేషన్, మెగా బ్యానర్లంటే మామూలుగా ఉండదు. ప్రమోషన్లు భారీగా సాగుతాయి. `ఏక్ మినీ కథ` ప్రమోషన్లు కూడా జోరుగా నడుస్తున్నాయి. కొత్త తరహా కాన్సెప్టులతో యూవీ వాళ్లు హోరెత్తిస్తున్నారు. ఆ సినిమా హిట్టయితే… శోభన్ రేసులోకి వచ్చేసినట్టే.